ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గ్రీన్ టీను తాగుతూ ఉంటారు. దీన్ని తాగడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతారు పోషకాహార నిపుణులు. అందుకే గ్రీన్ టీకి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. గ్రీన్ టీ పరగడుపున తాగడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా, తాజాగా ఉంటారని అంటారు. అయితే ఇది టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎనిమిది దేశాలకు చెందిన పది లక్షల మంది వ్యక్తులపై చేసిన పరిశోధన ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు వారు తెలిపారు.


యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిస్ వార్షిక సమావేశంలో ఈ అధ్యయనం తాలూకు వివరాలను ప్రదర్శించారు. రోజుకు నాలుగు కప్పుల టీని తీసుకోవడం వల్ల టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 17% తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. పదేళ్లపాటు రోజుకు నాలుగు కప్పుల గ్రీన్ టీ ని తాగిన వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గినట్టు గుర్తించారు. 


గ్రీన్ టీ లో మొక్కల ఆధారిత సమ్మేళనాలైనా పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. సాధారణ టీ తాగడం వల్ల అందులో చక్కెర కూడా శరీరంలో చేరుతుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. అదే గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి చక్కెర శరీరంలో చేరదు. గ్రీన్ టీ లో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే పాలీఫెనాల్స్ ఉంటాయి. అందుకే ఇది ఒక ఔషధంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు గ్రీన్ టీ తాగడం వల్ల డిహైడ్రేషన్ సమస్య కూడా రాదు. శరీరంలో ఇన్ల్ఫమేషన్‌ను ఇది తగ్గిస్తుంది.


శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీలోనూ కొద్దిగా కెఫీన్ ఉంటుంది. అయితే అది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రభావం చూపించదు. గర్భవతులు మాత్రం అధికంగా గ్రీన్ టీని తాగకూడదు. రెండు కప్పుల కన్నా ఎక్కువ టీని తాగితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. గ్రీన్ టీలో ఉండే కాటేచిన్స్ అనేవి చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఇవి గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొవ్వుని తగ్గించి రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తాయి. కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. 


బరువు తగ్గేందుకు ఈ గ్రీన్ టీలోని సమ్మేళనాలు ఎంతో సహకరిస్తాయి. రోజూ పరగడుపునే గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. కాలేయాన్ని రక్షించడానికి గ్రీన్ టీ సహకరిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. పేరుకున్న కొవ్వుని కరిగించి గుండెకు, కాలేయానికి మేలు చేస్తుంది. 



Also read: మీ బ్లడ్ గ్రూపును బట్టి ఆహారం తింటే ఎంతో ఆరోగ్యం, ఇదే బ్లడ్ గ్రూప్ డైట్




Also read: వాంగీ బాత్, వంకాయలతో ఇలా వేడి వేడి రైస్ చేసి తింటే అదిరిపోతుంది

















































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.