సనాతన హిందూ ధర్మంలో పితృపక్షం చాలా ముఖ్యమైంది. పితృపక్షం 15 రోజుల పాటు ఉంటుంది.  ఈ రోజుల్లో పిండదానం, తర్పణం, శ్రాద్ధ కర్మలు పూర్వీకులను స్మరించుకుంటూ చేస్తారు. అయితే ఇంట్లో ఒక దిక్కు కూడా పూర్వీకులకు నెలవుగా భావిస్తారు. ఇంట్లోని ఈ దిశకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పితృదోషం మొదలవుతుందని పండితులు హెచ్చిరిస్తున్నారు.


వాస్తు శాస్త్రాన్ని అనుసరించి దక్షిణ దిక్కును యమదిశగా పరిగణిస్తారు. ఇది పితృదేవతల నిలయంగా పరిగణిస్తారు. అందుకే పెద్దల ఫోటోలు ఇట్లో ఉత్తర దిక్కున దక్షిణాభిముఖంగా ఉండాలి.


Also Read: జూన్ 12 రాశిఫలాలు, ఈ మూడు రాశులవారికి వాహన ప్రమాదం ఉంది జాగ్రత్త!


పితృదేవతలు అంటే ఎవరు?


మన కుటుంబానికి చెందిన ఏడు తరాలకు చెందిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, బంధువులు, గురువులను పితృదేవతలని అంటారు. వీరి కోసం చేసే శ్రాద్ధకర్మలు, వదిలే తర్పణలు పితృదేవతారాధనగా చెప్పుకోవచ్చు. చనిపోయిన వారు ఎవరైనా సరే ప్రతి ఏడాది వారు మరణించిన తిథి రోజున శ్రాద్ధ కర్మలు తప్పకుండా చెయ్యాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం కుదరనపుడు కనీసం భాద్రపద మాసంలో చతుర్ధశి, మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వల్ల వారికి శ్రాద్ధ ఫలితం దక్కుతుంది.


అయితే పూర్వీకుల పోటోను పడకగదిలో లేదా డ్రాయింగ్ రూమ్ లో ఉంచకూడదు. ఇలా పూర్వీకుల పోటోలు పెట్టడం వల్ల ఇంట్లో నివసించే వారికి అనారోగ్యాలు కలుగుతాయి. రకరకాల వ్యాధులు వెంటాడుతాయి.


అంతేకాదు ఇంట్లో ఒకరి కంటె ఎక్కువ పితరుల ఫోటోలు పెట్టుకోవద్దని శాస్త్రం చెబుతోంది. అలా పెట్టుకుంటే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందట.


శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోయినా, పితృదేవతలను తలచుకోకపోయినా వారికి కోపం వస్తుంది. ఫలితంగా పితృదోషం కలుగుతుంది. పూర్వీకుల చిత్రాలను ఇంట్లోని పూజ గదిలో లేదా వంటగదిలోనూ పెట్టకూడదు.


ఎప్పటికప్పుడు పూర్వీకులను స్మరించుకుంటూ వారి శ్రాద్ధ కర్మలు ఆచరించడం ద్వారా పితృదేవతలను తృప్తి పరచడం తప్పనిసరి. ఈ సంప్రదాయాన్ని కొనసాగిండం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి. దీని వల్ల జీవితంలో పెద్ద పెద్ద కష్టాలు రాకుండా ఉండవచ్చు.


పితృ రుణం కచ్చితంగా తీర్చుకోవాలి


పితృరుణం మిగిలిపోతే ఆ ఇంట్లో అంతులేని అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు వెంటాడుతాయని శాస్త్రం చెబుతోంది. మరణించిన పెద్దలను తలచుకుని వారికి తర్పణలు వదిలి, శ్రాద్ధ కర్మలను నిర్వహించిన వారికి పితృదేవతల ఆశీస్సులు దొరకుతాయి. ఈ సంప్రదాయాన్ని పాటించేవారికి జీవితంలో సుఖ సౌఖ్యాలు అందుతాయని శాస్త్రం చెబుతోంది.


పితృదేవతలను తృప్తి పరిచేందుకు మూడు కార్యాలు చెయ్యాలి.



  • మరణించిన కుటుంబ సభ్యుల ఆత్మ శాంతికి తర్పణలు వదలడం

  • శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించడం

  • వారిని తలచుకుని శక్త్యానుసారం అన్నదానం, వస్త్రదానం వంటి దాన ధర్మాలు చెయ్యడం


గోవులకు సేవ చెయ్యడం వల్ల కూడా పితృదేవతలు శాంతిస్తారని పండితులు సూచిస్తున్నారు. కనుక పితృదేవతారాధన నిర్లక్ష్యం చెయ్యకూడదు,  మరవకూడదు.


Also read : ఆఫీసు డెస్క్ మీద ఇవి పెట్టుకుంటే మీ కెరీర్ పీక్స్‌లో ఉంటుంది


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.