వాస్తు శాస్త్రంలో వివరించిన చిన్న చిన్న అంశాలను అనుసరించడం వల్ల జీవితం చాలా తేలికగా నడిచి పోతుంది. ప్రతి వారికి జీవితంలో శాంతి, ఆనందం కావాలని కోరుకుంటారు. వేగవంతమైన జీవితంలో పురోగతి కావాలని కోరుకోని వారు ఉండదు. కానీ చాలా కష్టపడి పనిచేసినా సరే సరైన ఫలితాలు ఉండవు. కేరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సందర్బాల్లోనే వాస్తులోని కొన్ని చిన్నచిన్న నియమాలు అడ్డంకులు తొలగించి మార్గం సుగమం చేస్తాయి. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
వాస్తవానికి, వృత్తి, వ్యాపారంలో విజయం సాధించేందుకు వాస్తు శాస్త్రం కొన్ని నియమాలు సూచించింది. ఈ నియమాల ప్రకారం చాలా రకాల శుభ విషయాలు చాలా ఉన్నాయి. వాటిని ఆఫీసు డెస్క్ పై అలంకరించుకోవడం ద్వారా విజయ పథానికి, పురోగతి మార్గానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది.
డెస్క్ మీద వెదురు
వాస్తు ప్రకారం మీరు పనిచేసే చోట మీ డెస్క్ మీద వెదురు మొక్కను పెట్టుకోవడం చాలా శుభప్రదం. దీనిని లక్కీ బాంబు అని పిలుస్తారు. ఇది పరసరాల్లో సానుకూలత, మనసులో శాంతి తేవడమే కాదు. అదృష్టాన్ని కూడా ఇస్తుంది. వెదురు మొక్క డెస్క్ మీద పెట్టడం వల్ల అదృష్టం వస్తుందని నమ్ముతారు.
క్రిస్టల్
వాస్తు ప్రకారం ఆఫీసు డెస్క్ మీద క్రిస్టల్ తో చేసిన వస్తువులను ఉంచడం చాలా మంచిది. స్పటికంతో చేసిన వస్తువులను ఉంచడం మంచిది. స్పటికంతో చేసిన వస్తువులు దగ్గర ఉంటే అదృష్టంగా వాస్తు భావిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రాసెస్ చెయ్యబడుతుందట. ఫలితంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
బంగారు నాణేల ఓడ
బంగారు నాణేలతో నిండిన ఓడకు వాస్తులో చాలా ప్రాధాన్యత ఉంది. ఇది దగ్గర ఉన్నవాళ్ల వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉంటుందని వాస్తు చెబుతోంది. కేరీర్ చాలా అభివృద్ది చెందుతుందని వాస్తు చెబుతుంది. కేరీర్ లో వేగవంతమైన పురోగతి ఆశించేవారు తప్పకుండా బంగారు నాణేలతో కూడిన ఓడను దగ్గర ఉండాలి. కనుక ఆఫీసు డెస్క్ మీద తప్పనిసరిగా ఈ ఓడను పెట్టుకోవాలి.
కొన్ని అదనపు జాగ్రత్తలు
- వాస్తు ప్రకారం మీరు పని కోసం డెస్క్ దగ్గర కూర్చున్నపుడల్లా ఆ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనితో పాటు, చిందరవందరగా డెస్క్ ఉంచుకోవద్దు. పనిచేసే చోట వాతావరణం గందరగోళంగా ఉంటే అది వృత్తిజీవితంలో సమస్యలకు కారణం కావచ్చు.
- అవసరం లేని కాగితాలు పోగు పడకుండా చూసుకోవాలి. పనికి రానీ స్టేషనరీ, ఇతర వస్తువులను వెంట వెంటనే తీసెయ్యడం అవసరం. ఇలాంటి వస్తువులు ఆర్థిక శ్రేయస్సుకు ఆటంకం కలిగిసస్తాయి.
- ఆఫీసులో మీకోసం స్థలం కేటాయించినపుడు వాయవ్య దిశలో కూర్చోవడం మంచిది. ఏ దిశలో కూర్చుంటారు అనేది చాలా ముఖ్యమైంది. సూర్య రశ్మి చక్కగా తగిలే, సహజమైన వెలుగు ప్రసరించే చోటును ఎంచుకోవాలి.
- పిరమిడ్ ను డెస్క్ మీద పెట్టుకోవడం వల్ల ఏదైనా వాస్తు దోషం ఉన్నట్టయితే పరిష్కారంగా పనిచేస్తుంది.
- తలుపుకు ఎదురుగా డెస్క్ ఉండదు.
చిన్నచిన్న చిట్కాలతో కేరిర్ ను వృద్ధిలో పెట్టుకోవడం సులభం అవుతుంది.
Also read : చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.