ఎన్నో రకాల డైట్లు ప్రపంచంలో వాడుకలో ఉన్నాయి. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన డైట్ ‘బ్లడ్ గ్రూప్ డైట్’. అంటే మనిషి బ్లడ్ గ్రూపును బట్టి వారు తినే ఆహారం ఆధారపడి ఉంటుంది. దీన్ని పాటించే వారి సంఖ్య చాలా తక్కువ. దీని గురించి మొదటిసారి 1996లో ప్రకృతి వైద్యుడు అయిన డాక్టర్ పీటర్ డి అడెమో ఒక పుస్తకం ద్వారా తెలియజేశాడు. మన మనం తినే ప్రతి ఆహారం మన రక్త వర్గానికి మద్దతు ఇచ్చేదిగా ఉండాలని ఆయన తెలిపాడు. అయితే ఈ బ్లడ్ గ్రూప్ డైట్‌ని పాటించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
మనం తినే ఆహారం శరీరంలోకి చేరాక అది పడకపోతే శారీరక ప్రతిస్పందన కనిపిస్తుంది. అలాగే పడినా కూడా మంచి ఆరోగ్యం రూపంలో ప్రతిస్పందన వస్తుంది. ఆహారం పడకపోవడం, పడడం అనేది రక్త వర్గంతో అనుసంధానించి ఉంటుంది. అంటే మీరు తినే ఆహారం పడకపోతే అది మీ రక్త వర్గంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని అర్థం. కాబట్టి మీ బ్లడ్ గ్రూపుకు తగిన ఆహారాన్ని ఎంచుకొని తింటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు ప్రకృతి వైద్య నిపుణులు. రక్త వర్గాల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి. బ్లడ్ గ్రూప్ A, బ్లడ్ గ్రూప్ B, బ్లడ్ గ్రూప్ AB, బ్లడ్ గ్రూపు O... వీటిలోనే పాజిటివ్, నెగటివ్ అని ఉపరకాలు ఉన్నాయి. అయితే బ్లడ్ గ్రూపును బట్టి ఆహారాన్ని ఎంచుకోవాలని చెబుతున్నారు డాక్టర్ పీటర్.
బ్లడ్ గ్రూప్ A
A పాజిటివ్ లేదా A నెగటివ్ బ్లడ్ గ్రూపులు ఉన్నవారు తమ ఆహారంలో కిడ్నీ బీన్స్‌కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మిగతా బీన్స్ రకాలను మాత్రం వీరు తినవచ్చు. వీరు అధికంగా మొక్కల ఆధారిత ఆహారాన్ని అధికంగా తినాలి.
బ్లడ్ గ్రూప్ O
ఇక O పాజిటివ్, O నెగటివ్ బ్లడ్ గ్రూపు కలవారు తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అన్నింటికన్నా ఈ O బ్లడ్ గ్రూపు అత్యంత పురాతనమైనది. 40,000 BC నుంచి ఇది మనుషుల్లో ఉంది.
బ్లడ్ గ్రూప్ B
బ్లడ్ గ్రూప్ B పాజిటివ్, B నెగిటివ్ ఉన్నవారు మాంసం, పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవాలి. జంతువులు మేపడం ప్రారంభించిన తర్వాత సంచారకాలంలో ఈ బ్లడ్ గ్రూపు అభివృద్ధి చెందింది. అంటే ఇది అతి పురాతనమైనది కాదు.
బ్లడ్ గ్రూప్ AB
ఇక రక్త వర్గం AB పాజిటివ్, AB నెగిటివ్ ఉన్నవారు టర్కీ కోళ్లు, సోయాతో చేసిన టోఫు, సముద్రపు ఆహారం, కూరగాయల్ని అధికంగా తినాలని డాక్టర్ అడామో సిఫార్సు సిఫార్సు చేస్తున్నారు. ఈ రక్తరకం కేవలం 1000 సంవత్సరాల క్రితమే ఆవిర్భవించింది.
రక్త వర్గాన్ని బట్టి వారు తినే ఆహారం, జీవనశైలి మార్చుకుంటే స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని పొందచ్చని ఈ ప్రకృతి వైద్య నిపుణుడి ఆలోచన. బ్లడ్ గ్రూపును బట్టి డైట్ ను పాటించే వారి సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం తినే ఆహారంలో ఎక్కువ కోతలు ఉండడమే. బ్లడ్ గ్రూప్ A ఉన్నవారు పూర్తిగా మాంసాహారాన్ని తినడం మానేయాలని ఈ డైట్ సూచిస్తుంది. కానీ అలా చేయడం చాలా మందికి కుదరదు. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ డైట్ ఎంతోమంది పక్కన పెట్టారు. కేవలం మొక్కల ఆధారిత ఆహారం మీదే ఆధారపడాలంటే వారు వీగన్లుగా మారాలి. ఇది కష్టతరం. అందరూ ఇష్టంగా పాటించలేరు, కాబట్టి బ్లడ్ గ్రూప్ డైట్ దాదాపు పక్కన పడిపోయింది.
Also read: జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే ఆవనూనెతో ఇలా చేయండి
Also read: వాంగీ బాత్, వంకాయలతో ఇలా వేడి వేడి రైస్ చేసి తింటే అదిరిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.