ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బీట్‌రూట్ ముందుంటుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ అధికంగా ఉంటాయి. రక్తానికి బీట్ రూట్ చాలా అవసరం. ఇవి ఎర్రరక్తకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. కణాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. అయితే బీట్ రూట్ జ్యూస్ అధికంగా తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్టులు వస్తాయి. అధ్యయనాల ప్రకారం, బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఆక్సలేట్ కాల్షియంతో కలిసి రాళ్లను పెంచుతుంది. అందుకే బీట్ రూట్ జ్యూస్‌కు మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. ఇక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారైతే బీట్ రూట్ తినకూడదు. 
 
అలెర్జీలు వచ్చే అవకాశం
అలెర్జీల బారిన త్వరగా పడేవారు బీట్‌రూట్ తినకూడదు. వీరి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. బీట్‌రూట్ అధికంగా తినడం వల్ల కొందరు అనాఫిలాక్సస్ అనే అలెర్జీ స్థితికి కారణం అవుతారు. దీని ఫలితంగా గొంతు బిగుతుగా మారడం, బ్రాంకోస్పాస్మ్ అనే ఆరోగ్యస్థితి కలగవచ్చు.


బీటూరియా
బీట్‌రూట్ లేదా ఎరుపు రంగులో ఉన్న ఆహారాలును అధికంగా తీసుకోవడం వల్ల బీటూరియా వచ్చే అవకాశం ఉంది. అంటే మూత్రం లేదా మలం రంగు మారి ఎరుపురంగులోకి మారుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగకూడదు. ఈ కూరగాయలో నైట్రేట్లు ఉంటాయి. వీటి వల్ల పొత్తికడపులో తిమ్మిరి, నొప్పి వస్తుంది. 


గర్భిణులకు...
అధిక నైట్రేట్లు ఉండే బీట్‌రూట్ గర్భిణులు తినడం వల్ల శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లు, నోరు, పెదవులు, చేతులు, కాళ్ల చుట్టూ చర్మం రంగు మారుతుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. ఇది దీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీస్తాయి. బీట్‌రూట్ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. తక్కువ కాల్షియం స్థాయిలు ఉన్న మహిళలు బీట్‌రూట్ జ్యూస్‌ను తీసుకోకూడదు. బీట్ రూట్ కూర కూడా తక్కువగా తినాలి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు. 


Also read: ఉదయం పూట ఈ పానీయాలు తాగితే కొవ్వు కరగడం ఖాయం


Also read: దీర్ఘకాలం పాటూ గర్భనిరోధకాలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.