Weight Loss: ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఎంతో మంది దీని బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి త్వరగా వచ్చేస్తాయి. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. అధిక బరువు పెరుగుతుంటే మాత్రం ముందుగానే జాగ్రత్త పడాలి.పేలవమైన జీవక్రియ వల్ల కూడా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, కొవ్వు కరగకపోవడం వంటివి జరుగుతాయి. ఆ కొవ్వును కరిగించడానికి పరగడుపున కొన్ని పానీయాలు తాగడం వల్ల కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. 


ఆపిల్ సిడర్ వెనిగర్
ఒక గ్లాసు నీటిలో రెండు నుంచి మూడు టీస్పూన్ల ఆపిల్ సిడర్ వెనిగర్ వేయాలి. ఆ నీటిని ఉదయాన ఖాళీ పొట్టతో తాగాలి. పరగడుపున తాగితేనే మంచి ఫలితం ఉంటుంది. మీ పేగులను శుభ్రపరచడానికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది మీ pH స్థాయిని, మీ పొట్టలోని ఆమ్ల స్థితిని కూడా నిర్వహిస్తుంది. ఇది జీవక్రియ వేగాన్ని పెంచి కొవ్వు కరిగేలా చేస్తుంది. శరీరంలోని కొవ్వు మొత్తం కరిగే అవకాశం ఉంది. 


బ్లాక్ కాఫీ
బ్లాక్ కాఫీ కొవ్వును కరిగించేందుకు ఉత్తమ పానీయం. ఇది మీకు శక్తిని అందిస్తుంది. వ్యాయామానికి ముందు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అది కూడా ఉదయం పూటే. ఉపవాసం చేసే సమయంలో కూడా దీన్ని తాగడం ఉత్తమం. 
 
గ్రీన్ టీ
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి ఇదే ఉత్తమ పానీయం. చాలా మంది భోజనం తరువాత గ్రీన్ టీని తాగుతారు. ఇది చాలా తప్పు పద్ధతి. ఉదయం పూట ఖాళీ పొట్టతో తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గ్రీన్ జీవక్రియ వేగాన్ని పెంచి కొవ్వును కరిగిస్తుంది. సాయంత్రం దాటాక తాగకపోవడమే మంచిది. ఇది నిద్రరాకుండా అడ్డుకుంటుంది. గ్రీన్ టీ తాగాక ఒక గంట తరువాత అల్పాహారం చేయడం మంచిది. 


సిట్రస్ పండ్ల జ్యూస్
సిట్రస్ పండ్లు అంటే నారింజ, నిమ్మ వంటివి. వీటిలో ఆమ్ల కంటెంట్ ఉంటుంది. ఇవి నేరుగా జీవక్రియను ప్రభావితం చేయవు.కానీ పొట్ట దగ్గర కొవ్వు చేరకుండా చూసుకుంటుంది. భోజనంలో భాగంగా దీన్ని తిన్నా మంచిదే. లేదా ఉదయం పూట జ్యూస్ రూపంలో తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


నీళ్లు
మంచి నీళ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పరగడుపున గ్లాసుడు నీళ్లు తాగడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరిగే అవకాశం ఉంది. నీళ్లు తాగాక గంట పాటూ ఏమీ తినకూడదు. వేడినీళ్లు తాగడం మరీ మంచిది. జీవక్రియ చక్కగా పనిచేస్తుంది. తద్వారా కొవ్వు కరుగుతుంది.  నిద్రలో సంభవించే బర్నింగ్ మెకానిజమ్‌ను క్యాటాబోలిజం అంటారు. దీనికి తగినంత నీరు అవసరం. కండరాలను టోన్ చేయడంలో ఇది సహాయపడుతుంది. 



Also read: దీర్ఘకాలం పాటూ గర్భనిరోధకాలు వాడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే


Also read: ఒక పూట బ్లాక్ రైస్ తిని చూడండి, డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.