మధ్యకాలంలో చాలామంది పురుషుల వీర్యంలో  శుక్రకణాల సంఖ్య  తగ్గడం అనేది ప్రధాన సమస్యగా మారుతోంది. చాలామంది యువకులు ఈ సమస్యతో డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు. ఫలితంగా వీరిలో సంతానం లేమి సమస్య ఏర్పడుతోంది. అయితే ఎందుకు అనేక కారణాలు ఉన్నాయి అని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి దీనికి ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. శుక్రకణాల సంఖ్య లేదా వైద్య పరిభాషలో చెప్పాలంటే స్పెర్మ్ కౌంట్  తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ధూమపానం, మద్యపానం :


ధూమపానం, పొగాకు వాడకం, సిగరెట్లు  ఇతర పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల  వీర్యంలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సిగరెట్‌లో 2,000 కంటే ఎక్కువ విభిన్న రసాయనాలు ఉంటాయి. ఇందులోని నికోటిన్ అత్యంత హానికరమైన వాటిలో ఒకటి. ధూమపానం స్పెర్మ్ చలనాన్ని తగ్గిస్తుంది. తగ్గిన స్మెర్మ్ మూమెంట్ తక్కువ స్పెర్మ్ స్త్రీ యోనిలోని అండానికి  చేరుకోలేదు. ఫలితంగా గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ధూమపానం స్పెర్మ్‌లోని DNAకి హాని కలిగిస్తుంది.


ధూమపానంతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం కూడా స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కూడా స్పెర్మ్  మూమెంట్ ను  తగ్గిస్తుంది. అందువల్ల, గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మద్యపానాన్ని పరిమితం చేయడం లేదా మానుకోవడం  మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


ఊబకాయం:


అధిక బరువు లేదా ఊబకాయం మీ స్పెర్మ్ నాణ్యతను కూడా ప్రభావితం చేయవచ్చు. ఊబకాయం హార్మోన్ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది, టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గడం వల్ల స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. ఇంకా అధిక బరువు వృషణాల్లో వేడిని ఉత్పత్తి చేస్తుంది, పెరిగిన ఉష్ణోగ్రత స్పెర్మ్ నాణ్యతని తగ్గిస్తుంది.


ల్యాప్‌టాప్‌లు, టైట్ ప్యాంట్‌ల వాడకం:  


సుదీర్ఘకాలం ల్యాప్‌టాప్‌ను ఉపయోగించడం లేదా బిగుతుగా ఉండే ప్యాంటు లేదా లోదుస్తులను ధరించడం ద్వారా మీ వృషణాలను అధిక వేడికి గురై స్పెర్మ్ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వృషణాల చుట్టూ పెరిగిన ఉష్ణోగ్రతలు స్పెర్మ్ నాణ్యత  పరిమాణాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. 


ఆహారం:


మీరు తీసుకునే ఆహారం సైతం మీ స్పెర్మ్ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం, ప్యాక్ చేసిన  ఆహారాల ద్వారా, మీ స్పెర్మ్ నాణ్యత తగ్గిపోతుంది. కార్బోనేటేడ్  డ్రింక్స్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది కూడా  మీ స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తుంది. పండ్లు, కూరగాయలు  డ్రై ఫ్రూట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం  ద్వారా   వీర్యంలో  శుక్రకణాల నాణ్యతను పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  


నిద్ర లేకపోవడం:


స్పెర్మ్ ఆరోగ్యానికి క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్‌ను నిర్వహించడం చాలా ముఖ్యం. నైట్ షిఫ్ట్ వర్క్ మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యత  పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది. స్పెర్మ్  నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి రాత్రి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం.


Also Read : పరగడుపున చియాసీడ్స్ వాటర్ తాగుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.