చియా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువు తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంతేకాదు చర్మం, జుట్టుకు కూడా ఉపయోగపడుతుంది. ఫైబర్, ప్రోటీన్, అసంతృప్త కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, అనేక ముఖ్యమైన సూక్ష్మపోషకాలు మొదలైన చియా విత్తనాలలో  ఉన్నాయి. చియా గింజల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్,  బి విటమిన్లు కూడా ఉన్నాయి. మీరు చియా గింజలను సలాడ్‌లు, స్మూతీలు, వంటకాలు, జ్యూస్‌లు మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు. కానీ మీరు చియా గింజలను నీటిలో చేర్చడం ద్వారా తినేటప్పుడు రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయాన్నే చియా గింజలు తాగితే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


బరువు తగ్గడం:


 చియా విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా  పొట్టలోని కొవ్వును తగ్గించడంతోపాటు సంతృప్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. చియా గింజలు బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి.  రోజుకు 25 నుంచి 38 గ్రాముల చియా సీడ్స్ తీసుకున్నట్లయితే... బరువు తగ్గించుకోవచ్చు. చియా గింజలను నీటిలో కలిపి ఐదు నుంచి పది నిమిషాల తర్వాత తాగండి. అందులో ఉండే అదనపు ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది చివరికి బరువు తగ్గడానికి దారితీస్తుంది,.


మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:


 చియా విత్తనాల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మానసిక స్థితి,  ప్రవర్తనను మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు అనేవి  మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి,  విచారంతో పోరాడటానికి సహాయపడే ఒక సూపర్ ఫుడ్.


మలబద్ధకాన్నినివారిస్తుంది:


చియా సీడ్స్ లో కరగని ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ప్రేగు కదలికలకు సహాయపడతాయి.  మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేలా చేస్తాయి. చియా నీటిని తీసుకోవడం వల్ల అది జెల్ గా ఏర్పడుతుంది. దీంతో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 


సమృద్ధిగా  యాంటీ ఆక్సిడెంట్లు :


చియా గింజలలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంతోపాటు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా కణాలకు మాత్రమే కాకుండా చర్మానికి కూడా సహాయపడతాయి. 


జీవక్రియను పెంచుతుంది:


చియా విత్తనాలు మీకు మరింత శక్తిని అందిస్తాయి. రిఫ్రెష్ కోసం స్మూతీస్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇందులో  B విటమిన్లు, జింక్, ఐరన్ ,  మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి.


మెరుగైన చర్మం:


వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, ప్రసరణను పెంచడానికి, చర్మపు చికాకును తగ్గించడానికి, UV రేడియేషన్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. ఇవి ఆర్థరైటిస్‌ను నిరోధించి, చర్మం యొక్క సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను అందిస్తాయి.


యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు:


 చియా విత్తనాల్లో ఒమేగా-3-రిచ్, ఫైబర్,  ప్రోటీన్, శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలు ఉన్నాయి.  ఇవి ఆర్థరైటిస్ చికిత్సకు కూడా సహాయపడతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.