Weight Loss With Water: మంచి నీటితో బరువు తగ్గొచ్చా? అధిక బరువుతో బాధపడే వారికి వాటర్ వెయిట్ లాస్ కలిగిస్తుందా? అవును అంటున్నారు నిపుణులు. డ్రింకింగ్ వాటర్ తో అధిక బరువు తగ్గుతుందంటున్నారు. అయితే,  ఓ పద్దతి ప్రకారం నీటిని తాగడం వల్లే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. అంతేకాదు, ప్రతి రోజూ పొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల మెటబాలిజం స్థాయిలను పెంచుకోవచ్చు అంటున్నారు. ఫుడ్ మాదిరిగానే, నీరు కూడా ఓ పద్దతి ప్రకారం తాగాలంటున్నారు డైటీషియన్ సిమ్రాన్ వోహ్రా. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. నీళ్లు ఎలా తాగితే బరువు తగ్గుతారో సూచించారు. 


బరువు తగ్గేందుకు నీళ్లు ఎలా తాగాలంటే?


1. నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి.


2. వ్యాయామానికి 1 గంట ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి.


3. అరగంట వ్యాయామం తర్వాత మరో రెండు గ్లాసుల నీరు తాగాలి.


4. భోజనానికి అరగంట ముందు  రెండు గ్లాసుల నీరు తాగాలి.


5. స్నాక్స్ తర్వాత రెండు గ్లాసుల లెమన్ వాటర్ తీసుకోవాలి.


ఈ పద్దతిని రోజూ పాటించడం వల్ల బరువు తగ్గడంతో పాటు కంట్రోల్ లో ఉంటుందని సిమ్రాన్ వెల్లడించారు.






కేవలం నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గరు- జినాల్ పటేల్


అటు వాటర్ ద్వారా బరువు తగ్గించుకోవడం గురించి డైటీషియన్ జినాల్ పటేల్ కీలక విషయాలు వెల్లడించారు. రోజూ గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం లెవెల్స్‌ పెరుగుతాయన్నారు. “వెచ్చని నీరు మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అతిసారం లాంటి జీర్ణ సమస్యలను వెంటనే పరిష్కరిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను సులభంగా గ్రహించేలా చేస్తుంది. గోరువెచ్చని నీరు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కేలరీలను బర్న్ చేసి బరువు తగ్గడానికి సాయపడుతుంది” అని వివరించారు. అయితే, కేవలం నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గడం అసాధ్యం అన్నారు. బరువు తగ్గేందుకు పలు కారకాలు సాయపడతాయన్నారు.  


ఒత్తిడి, ప్రాసెస్డ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి


ఒత్తిడి, ప్రాసెస్డ్ ఫుడ్ తో పాటు జంక్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందన్నారు పటేల్. జీవన శైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల బరువును అదుపులో పెట్టుకోవచ్చన్నారు. "ఎక్కువ పని గంటలు, ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ కారణంగా బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి రోజూ కావాల్సినంత విశ్రాంతి తీసుకోవాలి. అనారోగ్యకరమైన, ప్రాసెస్ చేయబడిన పుడ్స్ తగ్గించి, పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, హెల్తీ ఫ్యాట్స్, లీన్ ప్రొటీన్లతో కూడిన పోషకాహారం తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. లైఫ్ స్టైల్ లో మార్పులు, చక్కటి పోషకాహారం తీసుకున్న తర్వాత కూడా బరువు తగ్గకపోతే డైటీషియన్ ను కలవడం మంచిదని పటేల్ సూచించారు.



Read Also: సరైన నిద్రలేకపోతే బరువు తగ్గరట.. రీజన్​ సిల్లీగా అనిపించినా ఎఫెక్ట్ మాత్రం ఎక్కువట జాగ్రత్త