ప్పటివరకు ఆరోగ్యంగా కనిపించే మనిషిని మూలనపడేలా చేసే వ్యాధి పక్షవాతం. అంతేకాదు.. ఇది ప్రాణాలను కూడా తీస్తుందనే సంగతి మీకు తెలుసా? మరి, పక్షవాతానికి దారితీసే పరిస్థితులు ఏమిటీ? దీన్ని ముందుగానే గుర్తించి చికిత్స పొందటం ఎలా? 


పక్షవాతం అంటే ఏమిటీ? ఎందుకు వస్తుంది?: పక్షవాతం వచ్చినవాళ్లలో చాలామందికి కాళ్లు, చేతులు పనిచేయవు. ఇందుకు కారణం.. బ్రెయిన్ స్ట్రోక్. శరీర భాగాల్లో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒక్కటైన మెదడు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా సక్రమంగా చేయగలం. అదిగానీ అదుపు తప్పితే పరిస్థితి చేయి దాటుతుంది. కాళ్లు, చేతులు పడిపోవడం (పనిచేయకుండా పోవడం) ముఖ కండరాలు బిగుసుకుపోవడం వంటివి ఏర్పడతాయి. ఈ పక్షవాతం.. ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అనే రెండు రకాలుగా ఉంటుంది. బ్రెయిన్‌లోని రక్త నాళాల్లో రక్త ప్రసరణలోని అవాంతరాల వల్ల శరీరంలోని కొన్ని భాగాలు పనిచేయకపోవడాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని అంటారు. మెదడులోని రక్త నాళాలు చిట్లిపోయి రక్త స్రావం జరిగితే హేమరేజిక్ స్ట్రోక్ ఏర్పడుతుంది. ఇది కూడా పక్షవాతానికి గురిచేస్తుంది. పక్షవాతం వల్ల మెదడులో ఒక వైపు పూర్తిగా స్తంభిస్తుంది. శరీరంలోని ఒక వైపు భాగాలన్నీ పనిచేయడం మానేస్తాయి.  


డయాబెటిస్ వల్ల పక్షవాతం వస్తుందా?: పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు ఉన్నవారికి కూడా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. కొందరికి వారసత్వంగా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కొందరికి వృద్ధాప్యం, వివిధ వ్యాధులు, ప్రమాదాల వల్ల కూడా పక్షవాతం వస్తుంది. డయాబెటీస్‌ను నిర్లక్ష్యం చేసినా పక్షవాతం వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలను పరీక్షించుకుని తగిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఊబకాయం, రక్తపోటు (బీపీ) సమస్యలు ఉన్నవారికి కూడా ఈ ముప్పు తప్పదు.  


పక్షవాతాన్ని ముందుగా గుర్తించడం ఎలా?: నడక తేడాగా ఉండటం లేదా నడవడానికి ఇబ్బందిగా ఉండటం. తరచుగా మతి మరపు, కాళ్లు-చేతులకు పట్టులేకపోవడం, మాట్లాడటంలో ఇబ్బంది కనిపిస్తాయి. పక్షవాతం వల్ల కొందరిలో మాట ముద్ద ముద్దగా వస్తుంది. అక్షరాలు సరిగా పలకలేరు. గట్టిగా మాట్లాడలేరు.


Also Read: హతవిధీ.. హంతకుడికి ముద్దు పెట్టిన లేడీ జడ్జి.. కెమేరాకు చిక్కిన రొమాన్స్! 


ఇలా చేస్తే మీరు సేఫ్: పై లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి. పరిస్థితి అంతవరకు వెళ్లకూడదంటే.. ఈ జాగ్రత్త పాటించాలి. 
❂ బాగా చల్లగా ఉండే నీటిని తలపై పోసుకోకూడదు. 
❂ గోరు వెచ్చని నీటితో స్నానం వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు 26 శాతానికి తగ్గినట్లు జపాన్‌లో జరిగిన ఓ సర్వే వెల్లడించింది.
❂ బీపీ, డయాబెటిస్‌లను నియంత్రణలో ఉంచుకోవాలి. 
❂ బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫాస్ట్ ఫడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. 
❂ రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయమం లేదా యోగా చేయాలి. వాకింగ్, సైక్లింగ్ కూడా మంచిదే. 
❂ శరీరానికి మేలు చేసే సమతుల ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.
❂ ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండాలి. 
❂ తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. 
❂ ప్రమాదాల వల్ల కూడా పక్షవాతం వస్తుంది కాబట్టి.. బైకు మీద వెళ్లేప్పుడు తలకు హెల్మెట్ ధరించాలి. 


Also Read: వామ్మో.. కొప్పులో పాము, ఆమె జడను చూసి జడుసుకున్న జనం, వీడియో వైరల్


Also Read: ఇలా హగ్ చేసుకుంటే.. శృంగారానికి ‘సై’ అన్నట్లే.. ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం!


Also Read: ఓనరమ్మతో భర్త సయ్యాట.. డోర్ బెల్ కెమేరాకు చిక్కిన శ్రీవారి లీలలు! (వీడియో)


Also Read: బాయ్‌ఫ్రెండ్ ముద్దు పెట్టలేదని పోలీసులకు కాల్ చేసిన ప్రియురాలు, చివరికి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి