ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు, అందుకే మిగిలేటట్టే ఆహారం వండుకుంటారు. తిన్నాక మిగిలిన ఆహారాన్ని దాచుకొని మళ్ళీ తింటూ ఉంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో ఆయుర్వేదం వివరిస్తోంది. దాని తాజాదనం, రుచి ఆహారం ఎంతవరకు నిలుపుకుంటుందో ఆ సమయంలోపే అని తినేయాలని చెబుతోంది. తాజాదనం పోతే ఆ పాత ఆహారం అనారోగ్యాలకు కారణం అవుతుందని వివరిస్తోంది ఆయుర్వేదం. 


సైన్స్ చెబుతున్న ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని 15 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే చాలు, ఆహారంలో ఉన్న వ్యాధికారక బ్యాక్టీరియాను చంపవచ్చు. తాజాదనం కూడా మళ్లీ ఆహారానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయుర్వేదం ప్రకారం మాత్రం వండిన ఆహారాన్ని మూడు గంటల్లోపు తింటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆ తర్వాత పోషక విలువలు తగ్గే అవకాశం ఉంది. ఇక మిగిలిపోయిన ఆహారాన్ని అయితే 24 గంటల్లోపు తినాలి. 24 గంటల తరువాత నిల్వ ఉన్న ఆహారాన్ని తింటే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు అలాంటి ఆహారంలో బ్యాక్టిరియా అభివృద్ధి చెందడం మొదలైపోతుంది. ఈ మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడిచేసినా  కూడా ఆ బ్యాక్టిరియా పోయే అవకాశం లేదు. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, శరీరంలో దోషాలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని తినేవారిలో పేగు ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. పేగు రోగాలు వచ్చే అవకాశం ఉంది. 


ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం ఆహారాన్ని శీతలీకరించి, మళ్లీ వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషక విలువలు తగ్గవచ్చు. కాబట్టి తాజాగా తయారు చేసిన ఆహారాన్ని మూడు గంటల్లోపు తినేయాలి. తాజా ఆహారం ప్రాణాన్ని పోషిస్తుందని. జఠరాగ్నిని అంటే జీర్ణంలోని వేడిని పెంచుతుందని నమ్ముతారు. తాజాగా వండిన ఆహారాన్ని నిల్వ ఉంచడం, మళ్ళీ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వంటివి తినవచ్చు. కానీ మరీ పాత ఆహారాన్ని తినకపోవడం మంచిది. లేకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయి.  


మిగిలిపోయిన ఆహారం విషయంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. 
1. ఆహారం వండాక గంటన్నరలో తింటే రుచిగా ఉంటుంది. 
2. ఆహారం పూర్తిగా చల్లారాకే ఫ్రిజ్ లో పెట్టాలి. 
3. మాంసం, పాలతో చేసిన వంటకాలు, సముద్ర ఆహారం వంటివి నిల్వ చేయకుండా తినేయడమే మంచిది. 
4. ఏదేమైనా తాజా ఆహారం తింటే మంచిది. ఇది మన శరీరానికి, శ్వాసకు ఎంతో మేలు చేస్తుంది. 



Also read: వ్యక్తి మరణించే ముందు ఒక్కొక్కటిగా ఈ లక్షణాలను కోల్పోతూ ఉంటాడు - స్టాన్‌‌ఫొర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.