ఒకప్పుడు ఫ్యాషన్ రంగంలో ఉన్న వారే హైహీల్స్‌ను అధికంగా వాడే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి హైహీల్స్ వేసుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది. కాలేజీలకు కూడా రోజూ హైహీల్స్ వేసుకునే వారు ఉన్నారు. ఇక ఉద్యోగినులు కూడా హైహీల్స్ అధికంగా వాడుతున్నారు. ముఖ్యం కాస్త పొట్టిగా ఉన్నామనే భావన ఉన్న వారు హైహీల్స్ వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హైహీల్స్ అప్పుడప్పుడు వేసుకుంటే ఫర్వాలేదు కానీ రోజూ గంటల పాటూ వాటితో ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ కాళ్లకు, తుంటి భాగానికి కూడా ఇది హాని కలిగిస్తుంది. మడమల భాగంపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. కాళ్లపై, శరీరంపై ఒత్తిడిని కలుగుచేసే హైహీల్స్ దూరంగా ఉండడమే మంచిది. హైహీల్స్ కు బదులు వెడ్జస్ (చెప్పుల్లో ఇదో రకం) వాడడం మంచిది. వీటి వల్ల పెద్దగా శరీరంపై ప్రభావం పడకపోవచ్చు.
1. ఎత్తయిన హైహీల్స్‌ను ఎక్కువ సమయం పాటూ వేసుకోవడం వల్ల వెన్ను కింద భాగంలో నొప్పి మొదలవుతుంది. అవి పాదాలకు సపోర్ట్ గా ఉండవు. వేసుకుంటే కంఫర్ట్ గా అనిపించేవే కాళ్లకి ధరించాలి. హైహీల్స్ నిత్యం ధరించడం వల్ల నొప్పులు పుట్టడం, ఒక్కోసారి పుండ్లు పడడం కూడా జరుగుతుంది.
2. ఫ్యాషన్ కోసం హైహీల్స్ వేసుకుంటే పాదాల్లో నొప్పిని కలిగిస్తుంది. సౌకర్యంగా కూడా ఉండవు. ప్రతిరోజూ వీటిని ధరించడం వల్ల పాదాల సమస్యలు మొదలవుతాయి.
3.నరాల వ్యవస్థపై కూడా ఇవి ప్రభావాన్ని చూపిస్తాయి. కాళ్లు, పాదాల్లోని నరాలపై హైహీల్స్ ప్రభావం అధికమే. కాని ఇది చివరికి కాళ్లలో తీవ్రమైన నొప్పికి కారణం అవుతుంది. మడమల ప్రాంతంలో తిమ్మిర్లు రావడం, జలదరింపుగా అనిపించడం ఎక్కువవుతుంది. కేవలం పాదాల ప్రాంతంలోనే కాదు కాళ్లు అంతటా ఇలాగే జరుగుతుంది.
4. హైహీల్స్ అధికంగా వేసుకోవడం వల్ల శరీర భంగిమే మారిపోతుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. హైహీల్స్ వేసుకుని స్లిప్ అయి పడితే ఫ్రాక్చర్లు తీవ్రంగా అయ్యే అవకాశం ఉంది. నడుము, తుంటి ఎముకలు విరిగే ప్రమాదం ఉంది.
5. హైహీల్స్ వల్ల వెన్నుముకపై తీవ్ర ప్రభావం పడుతుంది. వెన్ను నొప్పి మొదలైతే ఆసుపత్రి చుట్టు తిరగక తప్పదు.
6. కాళ్ల కండరాలపై హైహీల్స్ తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. కండరాల నొప్పులు వేధిస్తాయి. పాదాల చీలమండలు విపరీతంగా నొప్పి పుడతాయి.
Also read: దీపావళికి గులాబ్ జామూన్, ఈసారి తెల్లని బ్రెడ్డుతో చేసేయండిలా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.