ప్రొడక్టివ్ డే... అంటే రోజంతా ఉపయోగకరంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడవడం. మీ రోజు కూడా అలాగే ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. అది కూడా ఉదయం 9 గంటల్లోపే. 


1. త్వరగా లేవాలి
విజయవంతమైన వ్యక్తుల్లో ఉండే కామన్ లక్షణం ఉదయానే  లేవడం. పొద్దెక్కేవరకు పడుకుంటే బద్దకం పెరుగుతుంది. కాబట్టి ఉదయం ఆరు గంటల్లోనే లేవడం అలవాటు చేసుకోవాలి. ప్రారంభంలో కష్టంగా ఉండొచ్చు. తరువాత అలవాటుగా మారుతుంది. 


2. గ్లాసు నీళ్లతో మొదలు
మీ ప్రశాంతమైన రోజును గ్లాసుడు నీళ్లు తాగడం ద్వారా మొదలుపెట్టాలి. జీవక్రియ పనితీరుకు, చర్మ ఆరోగ్యానికి, శరీరంలోని వ్యర్థ పదార్థాల తొలగింపుకు నీళ్లు తాగడం చాలా అవసరం. మెదడులో 75 శాతం నీరు ఉంటుంది, కాబట్టి నీళ్లు తాగడం ముఖ్యం. మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.  రాత్రి పడుకోబోయే ముందు నీళ్లు తాగుతారు, ఆ తరువాత మళ్లీ ఉదయం లేచే వరకు తాగరు కాబట్టి, శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే లేచిన వెంటనే నీళ్లు తాగాలి. 


3. వ్యాయామం
వ్యాయామం కేవలం శారీరకంగానే కాదు మానసికంగానూ ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. ఏకాగ్రత, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉదయాన లేచాక వ్యాయామం చేయడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారు.  పడుకుని లేచిన అరగంట తరువాత వ్యాయామం ప్రారంభించాలి. 


4. ధ్యానం
ధ్యానం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటూ, ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంపై చాలా సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. ఉదయం ధ్యానం చేయడం వల్ల ఆ రోజంతా సవాళ్లను స్వీకరించే శక్తి మీకు లభిస్తుంది. రోజుకు కేవలం 10 నిమిషాల పాటూ ధ్యానం చేసినా చాలు.


5. పోషకాల బ్రేక్‌ఫాస్ట్
ఉదయం తొమ్మిదిలోపే మీరు బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తి చేసుకోవాలి. ఇది శరీరం, మెదడులోని గ్లూకోజ్ నిల్వలను తిరిగి నింపుతుంది. మెదడు సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా అవసరం. పోషకాహారం కలిగిన అల్పాహారం మీ శరీరానికి మంచి ఇంధనంగా ఉపయోగపడుతుంది. 


6. పుస్తకం చదవడం, పాటలు వినడం
ఉదయాన లేచిన వెంటనే పనుల్లోకి దిగి పోకండి. మీకంటూ కొంత సమయాన్ని వెచ్చించండి. ఓ పావుగంట సేపు పుస్తకం చదవడం, లేదా పాటలు వినడం చేయండి. టీ, కాఫీ తాగుతూ ఈ పనులు చేస్తే మీకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. 


Also read: సెలెబ్రిటీ గాసిప్స్ ఇష్టపడేవారికి తెలివి తక్కువగా ఉంటుంది... కొత్త అధ్యయన ఫలితం


Also read:  పంది గుండె మనిషికి ప్రాణం పోసింది, చరిత్రలోనే తొలిసారిగా జంతువు గుండెతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్



Also read: ఎక్కువ సమయం ఫోన్ చూస్తున్నారా? ఈ రోగాలు తప్పవు


Also read: కుకీలు, బిస్కెట్లు మిగిలిపోయాయా... వాటితో ఈ సింపుల్ రెసిపీలు చేసుకోవచ్చు


Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.