బొప్పాయి పండులో ఉండే పోషకాలు ఇన్నీ అన్నీ కావు. గర్భం ధరించాలనుకుంటున్నవారు తప్ప మిగతా అందరూ తినవచ్చు.ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు తింటే మరీ మంచిది. దీనిలో విటమిన్ ఎ, సి, అనేక ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. అయితే బొప్పాయిని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు ఆరోగ్యనిపుణులు. బొప్పాయి పండు తిన్న వెంటనే నిమ్మరసం తాగడం వంటివి చేయొద్దని అంటున్నారు. 


నిమ్మరసం చల్లుకుని...
 చాలా మంది పండ్ల సలాడ్లపై నిమ్మరసం చల్లుకుని తింటారు. ఆ పండ్ల ముక్కల్లో బొప్పాయి లేకుండా చూసుకోవాలి. నిమ్మరసం, బొప్పాయి శరీరంలోకి చేరి విషపూరితంగా మారే అవకాశం ఉంది. ఆ రెండింటి కలయిక రక్తహీనతకు, హిమోగ్లోబిన్ అసమతుల్యతకు కారణం కావచ్చు. పిల్లలు, మహిళల్లో ఈ పరిస్థితి అధ్వానంగా మారవచ్చు. కాబట్టి బొప్పాయి తిన్న గంట వరకు నిమ్మరసం  తాగవద్దు. అలాగే నిమ్మరసం తాగితే ఓ నలభై నిమిషాల వరకు బొప్పాయి తినవద్దు అని సిఫారసు చేస్తున్నారు ఆరోగ్యనిపుణులు. 


బొప్పాయి తినడం ముఖ్యమా?
కచ్చితంగా తినడం ముఖ్యమనే చెప్పాలి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేటులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, లుటీన్, జియాంక్సితిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో డైటరీ ఫైబర్ అధికంగా ఉన్నందున, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున ప్రతిరోజూ తినాలని ఫిట్ నెస్ నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో పపైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది అలెర్జీలతో పోరాడే శక్తిని ఇస్తుంది. బొప్పాయి పండును తినడం వల్ల ఎర్రరక్త కణాలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇది చాలా మేలు చేస్తుంది. 


శరీరానికి కావాల్సిన పోషకాల కోసం రోజూ మూడు సన్నని ముక్కలు లేదా ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే చాలు. అంతకు మించి ఎక్కువ తినకూడదు. ఈ పండును అతిగా తినడం కూడా చాలా హానికరం. ఎందుకంటే దీనిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ వల్ల అలెర్జీలు, వాపు, తల తిరగడం, దద్దుర్లు, తలనొప్పి వంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే గర్భం ధరించాలని ప్రయత్నిస్తున్నవారు, అయిదు మాసాల్లోపు గర్భిణులు బొప్పాయిని తినకూడదు.  


Also read: ప్రేమించండీ పిల్లల్ని కనండి- యువతకు అదిరిపోయే ఆఫర్- పెళ్లి తప్పనిసరికాదు!


Also read: ఆ హీరో కాలివేళ్లు తొలగించడానికి కారణం డయాబెటిసే, ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడండి