తమిళ నటుడు,రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ కొన్నిరోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆయన డయాబెటిస్ బాధపడుతున్నారు. దాని కారణం గాంగ్రీన్ అనే ఆరోగ్యసమస్య తలెత్తింది. దీని కారణంగా కాలి వేళ్లు తీసేయాల్సి వచ్చింది. అతనికి కాలిలోని మధ్య మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. డయాబెటిస్ ఉన్న ప్రతి ఒక్కరు గాంగ్రెన్ సమస్య గురించి తెలుసుకోవాలి. ఇలాంటి స్థితి ఏర్పడింతే కాలి వేళ్లనే కాదు, పాదాలనూ పొగొట్టుకోవాల్సి వస్తుంది. 


ఏమిటీ గాంగ్రీన్?
గాంగ్రీన్ అనేది డయాబెటిస్ కారణంగా వచ్చే అనారోగ్యం. శరీరంలోని ఒక ప్రాంతానికి రక్తప్రసరణ కాకుండా, అంతరాయం కలిగినప్పుడు శరీర కణజాలం చనిపోతుంది. ఆ పరిస్థితినే గాంగ్రీన్ అంటారు. ఇది గాయం వల్ల లేదా, నియంత్రణ లేకుండా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఆ ప్రాంతంలో కణజాలం చనిపోవడం వల్ల కలుగుతుంది. ఈ పరిస్థితి ఎక్కువగా కాళ్లు, కాలివేళ్లు, పాదాలు, చేతులనే ప్రభావితం చేస్తుంది. ఆ ప్రాంతం రంగు మారడం, లేదా చీము పట్టడం, స్పర్శ తెలియక పోవడం వంటి లక్షణాల ద్వారా గాంగ్రీన్ బయటపడుతుంది. గాంగ్రీన్ పరిస్థితి తలెత్తినప్పుడు చనిపోయిన కణజాలాన్ని తొలగించాలి లేకుంటే అక్కడి బ్యాక్టిరియా రక్త నాళాల ద్వారా చాలా వేగంగా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. దీని వల్ల ప్రాణానికే ప్రమాదం. అందుకే గాంగ్రీన్‌ను గుర్తించగానే ఆ భాగాన్ని తొలగిస్తారు వైద్యులు. 


గాంగ్రీన్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. యాంటీబయోటిక్స్ మందుల ద్వారానే పరిస్థితిని సాధారణంగా మారుస్తారు. చికిత్స సరైన సమయంలో అందకపోతే సెప్టిక్ గా మారిపోతుంది. 


పాదాలు చెక్ చేయాలి...
డయాబెటిక్ పేషెంట్లు ప్రతిరోజూ మీ పాదాలను చెక్ చేసుకోవాలి. ఏదైనా ఇన్ఫెక్షన్, నొప్పి, లేదా స్పర్శ తెలియకపోవడం... ఎలాంటి చిన్న తేడా కనిపించినా జాగ్రత్త పడండి. ఒత్తిడిని తగ్గించుకోండి. 


నియంత్రణలో షుగర్
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. హఠాత్తుగా పెరిగినట్టు అయితే వెంటనే జాగ్రత్త పడండి. ఇది గాంగ్రీన్ వ్యాప్తికి కారణం అవుతుంది. తినే ఆహారానికి సంబంధించి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు, ఇన్సులిన్ సమయానికి తీసుకోవాలి. 


నో ధూమపానం
ధూమపానం శరీరంపై చూపించే చెడు ప్రభావం చాలా ఎక్కువ. ఇది శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను గ్రాంగేన్ కు కారణం అవుతుంది. 


చికిత్స ఇలా...
1. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని కట్టడానికి చేయడానికి ఇన్ఫెక్షన్ తీవ్రంగా సోకిన శరీరభాగాన్ని కత్తిరిస్తారు. దీని వల్ల ఇతర శరీరభాగాలకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. 
2. వైద్యులు రక్తప్రసరణ ఆగిన ప్రాంతానికి తిరిగి రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స చేస్తారు. బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. 
3. హైపర్‌బారిక్ ఆక్సిజన్ థెరపీ ఇది గాంగ్రీన్ నయం చేసే ఒక చికిత్స. మీ రక్త ప్రవాహంలోకి అధికస్థాయిలో ఆక్సిజన్ ను పంపిస్తారు. అది ప్రభావిత ప్రాంతానికి చేరుకుని రక్త సరఫరాను వేగవంతంగా చేస్తుంది. 


Also read: మహిళలూ జాగ్రత్త, నలభై ఏళ్లు దాటితే కచ్చితంగా రొమ్ము క్యాన్సర్ చెక్ చేసుకోవాల్సిందే


Also read: యోగా, ప్రకృతి వైద్యం ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చా?