పరిస్థితులు మారాయి, రొమ్ము క్యాన్సర్ చాప కింద నీరులా నిశ్శబ్ధంగా మహిళలపై దాడి చేస్తోంది. సర్వే ప్రకారం ప్రతి 22 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోక తప్పదని చెబుతున్నారు వైద్యులు. నలభై ఏళ్లు దాటిన ప్రతి మహిళ తరచూ రొమ్ము క్యాన్సర్ టెస్టు చేయించుకోమని సలహా ఇస్తున్నారు. ఇది మొదటి దశలోనే బయటపడితే సర్జరీ వరకు అవసరం పడదు. కేవలం కీమోథెరపీ ద్వారానే సమస్యను తొలగించుకోవచ్చు. కొందరికి కీమోథెరపీ కూడా అవసరం లేకుండా మందులతో కూడా చికిత్స చేసే అవకాశం ఉంది. అయితే క్యాన్సర్ మందులు వాడడం చాలా కష్టతరంగా ఉంటుంది. సైడ్ ఎఫెక్టులు కూడా ఎక్కువే. 


ఎలా నిర్ధారిస్తారు?
రొమ్ము క్యాన్సర్ ను స్క్రీనింగ్ టెస్టు ద్వారా నిర్ణయిస్తారు. ఇప్పుడు రక్త పరీక్ష ద్వారా కూడా నిర్ధారించే అధునాత సదుపాయం వచ్చింది. అది భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. రక్త పరీక్షలో దాదాపు 99 శాతం కచ్చితంగా ఫలితాలు వస్తాయి. పరిస్థితి చేయి దాటినప్పుడే రొమ్ములను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రొమ్ములో  ఏర్పడిన క్యాన్సర్ కణితిని తొలగించే చికిత్సలను మ్యాస్టెక్టమీ, లంపెక్టమీ అంటారు. వీటినే దాదాపు అనుసరిస్తారు. 


టమోటోలు, బ్లూబెర్రీలు, బ్రకోలీ, ఆకుపచ్చని ఆకుకూరలు, వాల్ నట్స్ వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ బారిన పడినవాళ్లు వీటినే అధికంగా తినాలి. వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. 


ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువ?
రొమ్ము క్యాన్సర్ వారసత్వం వచ్చే అవకాశం ఉంది. జన్యువుల ద్వారా సోకుతుంది. ఒకవేళ వారసత్వంగా రాకపోతే కొన్ని కారణాల వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 


1. మహిళల్లలో వయసు పెరుగుతున్న కొద్దీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. 40 ఏళ్లు దాటాక రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆ వయసు దాటాక తరచూ చెక్ చేయించుకుంటూ ఉండాలి. 


2. పన్నేండేళ్ల కంటే తక్కువ వయసులో రజస్వల అయిన ఆడపిల్లల్లో పెద్దయ్యాక రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే 55 ఏళ్ల వరకు మెనోపాజ్ రాని వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. 


3. ఊబకాయం ఎన్నో అనారోగ్యాలకు కారణం అవుతుంది. అధిక బరువు ఉండే మహిళల్లో ఈ క్యాన్సర్ రావచ్చు. 


4. అధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని తినకూడదు. కొవ్వు కణితిలు ఏర్పడేందుకు సహకరిస్తుంది. కణితి పెరుగుదలకు ఈస్ట్రోజెన్ హార్మోనును ప్రేరేపిస్తుంది. అందుకే కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినకూడదు.  


Also read: యోగా, ప్రకృతి వైద్యం ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చా?




Also read: మగవారిలో కోరికలు పెంచే హార్మోన్ టెస్టొస్టెరాన్, అది తగ్గితే కనిపించే లక్షణాలు ఇవే