Disha Patani's Fitness Lessons : హీరోయిన్స్ ఫిట్‌నెస్‌ని బాగా మెయింటైన్ చేస్తారు. అలా ఫిట్నెస్ విషయంలో రాజీపడని హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. ఈ భామ తన ఫిట్‌నెస్‌ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయదు. అందుకే ఆమె బాడీ అంత టోన్డ్‌గా ఉంటుంది. అది ఒక్కరోజులో.. ఒక్క వ్యాయామంతో వచ్చినది కాదు. ఎంతో డెడికేషన్ ఉంటుంది బాడీ టోన్డ్‌గా మారుతుంది. పర్ఫెక్ట్ జిమ్ రోటీన్‌ను ఫాలో అవుతూ.. డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రూపును దక్కించుకుంది దిశా. ఇంతకీ ఆమె ఫిట్నెస్ రోటీన్ ఏంటి? టోన్డ్ బాడీకి హెల్ప్ చేసిన వ్యాయామాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దిశా పటానీ జిమ్ రోటీన్ని ఎప్పుడూ స్కిప్ చేయదు. రోటీన్ని వ్యాయామాలు కాకుండా.. వివిధ భిన్నమైన అంశాలు ఫాలో అవుతూ ఉంటుంది. కార్డియో, జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్, బరువులు ఎత్తడాలు వంటివాటివి చేస్తూ ఉంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో అయితే ఈ విషయం తెలిసిపోతుంది. కేవలం వర్క్ అవుట్స్ మాత్రమే కాకుండా న్యూట్రిషియన్ డైట్‌ని ఫాలో అవ్వడం వల్లనే టోన్డ్ బాడీ ఆమె సొంతమైంది ఎన్నోసార్లు తెలిపింది దిశా. ఫిట్నెస్ విషయంలో ఆమెను ఎలా ఫాలో అవ్వొచ్చొ ఇప్పుడు చూసేద్దాం.
బరువులు లిఫ్ట్ చేస్తోందట
స్ట్రెంత్ ట్రైయిన్ కోసం బరువులు లిఫ్ట్ చేస్తుంది దిశా. ఇది మెటబాలీజం పెంచుతుంది. కేలరీలను వేగంగా కరిగించడంలో.. బరువును అదుపులో ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. డెడ్ లిఫ్ట్స్ని కూడా చాలా ఈజీగా చేసేస్తుంది దిశా. ఇవి కండరాలకు మంచి బలాన్ని అందించి.. బాడీని మంచి షేప్‌లో ఉంచుతాయి.
కార్డియో..
దిశా పటానీ కార్డియోని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు. రన్నింగ్, సైక్లింగ్ వంటివి రెగ్యూలర్‌గా చేస్తుంది. దీనివల్ల చర్మానికి మంచి గ్లో అందడమే కాకుండా.. రక్తప్రసరణ మెరుగవుతుంది. దిశా యవ్వనంగా కనిపించడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. గుండె ఆరోగ్యంతో పాటు.. మెదడు ఆరోగ్యానికి కూడా కార్డియో మంచి ప్రయోజనాలు అందిస్తుంది. ఆరోగ్యకరమైన పద్ధతిలో ఫిట్నెస్ గోల్స్‌ని రీచ్ కావడానికి కార్డియో ఉపయోగపడుతుంది.
కిక్ బాక్సింగ్..
ఫిట్నెస్ విషయంలో రోటీన్ని ఫాలో అయితే.. ఎక్కువ కాలం జిమ్ చేయలేరు. కాబట్టి ఫిట్నెస్ రోటీన్లో మిమ్మల్ని ఎగ్జైట్ చేసే అంశాలను చేర్చుకోవాలి. దిశా కూడా అంతే. ఫిట్నెస్ రోటీన్‌గా ఉండేలా కాకుండా.. ఒక్కోసారి ఒక్కోటి చేస్తుంది. అలా తన ఫిట్నెస్ రోటీన్లో కిక్ బాక్సింగ్ చేర్చుకుంది. ఇది కేలరీలను కరిగించడమే కాకుండా.. టోన్డ్ బాడీని ప్రమోట్ చేస్తుంది. ఇది ఫుల్ బాడీ వర్క్అవుట్కి మంచి ఆప్షన్. అప్పర్ బాడీ స్ట్రెంత్‌ని పెంచి.. మంచి బాడీని అందిస్తుంది.
డ్యాన్స్..
వ్యాయామంలో ఫన్ ఉండేందుకు రెగ్యూలర్‌గా డ్యాన్స్ చేస్తుంది దిశా. ఇది తన ఫుట్ వర్క్‌ని మెరుగుపరచడంతో పాటు.. ఫిట్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. చెమట కూడా ఎక్కువగా వస్తుంది. కేలరీలు కూడా త్వరగా కరుగుతాయి.
జిమ్నాస్టిక్స్..
బాడీ ఫ్లెక్సీబుల్‌గా ఉండేందుకు జిమ్నాస్టిక్స్ చేస్తుంది దిశా. ఇవి కండరాలను దృఢంగా చేయడంతోపాటు.. ఫ్లెక్సీబిలిటీని పెంచుతాయి. బ్యాక్ ఫ్లిప్స్, జంప్స్ వంటివి చేస్తూ.. ఫిట్నెస్ గోల్స్ పెంచుతుంది దిశా. ఇవి తన లుక్, బాడీ మంచి ప్లస్ అవుతాయి.
మీరు కూడా ఫిట్నెస్ గోల్స్ కోసం దిశాపటానీని ఇన్స్ప్రేషన్గా తీసుకోవచ్చు. ఆమె ఇన్‌స్టాలో ఫిట్నెస్కి సంబంధించిన ఎన్నో వీడియోలు కూడా ఉన్నాయి. మీరు దిశాను ఫాలో అయిపోయి.. ఫిట్నెస్ దివాగా మారిపోండి.
Also Read : పిల్లల్లో న్యుమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. అవగాహనలేకనే లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారట