టెక్నాలజి అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఆరోగ్యరంగంలో అయితే చాలా ఎక్కువ మార్పులే కనిపిస్తున్నాయి. టూత్ బ్రష్ ల నుంచి స్నానింగ్ ల వరకు అన్ని విషయాల్లోనూ ఎలక్ట్రానిక్స్ ప్రవేశించాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు సైతం వాడుకలోకి వచ్చాయి. అయితే వాటిని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ప్రమాదకరంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లపై కొత్త పరిశోధనలో.. దాదాపు సగం మంది సరైన పద్ధతిలో ఈ బ్రష్‌లను వాడకలేకపోతున్నారని, ఫలితంగా వీటి వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందలేకపోతున్నారని తేలింది.  సమయానికి వాటి హెడ్స్ ను మార్చకపోవడం వల్ల ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వల్ల నష్టం కూడా వాటిల్ల వచ్చని అంటున్నారు.


ఈ అధ్యయనం కోసం దాదాపు 1000 మంది డేటా సేకరించారు. వీరిలో దాదాపు 3 శాతం మంది అసలు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ హెడ్ మార్చరట. నోటి పరిశుభ్రతకు అల్జీమర్స్ వ్యాధికి పరోక్ష సంబంధం ఉన్నట్టు చాలా పరిశోధనలు వెలువరించాయి.


అరిగిపోయిన టూత్ బ్రష్ లు దంతాలను సరిగ్గా శుభ్రం చెయ్యలేకపోవడమే కాదు చిగుళ్లను కూడా దెబ్బతీస్తాయట. బ్రష్ లో ఉన్న బ్రిసిల్స్ వంగిపోయినపుడు అవి అసలు ఏ మాత్రమూ శుభ్రం చెయ్యలేవని టాప్ డెంటిస్ట్, ఓరల్ హెల్త్ ఫౌండేషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ నిగెల్ కార్టర్ అన్నారు.


నోటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ హెడ్ ను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దంతాల సరిగ్గా శుభ్రం చెయ్యక పోతే దంతాల మీద ప్లేక్ ఫామ్ అవుతుంది. ఇది దీర్ఘకాలంలో పీరియాంటిటైటిస్ కు కారణం కావచ్చు. దీనిని గమ్ డిసీజ్ అంటారు. దీనికి కారణమయ్యే బ్యాక్టీరియా ఎఫ్. న్యూక్లియేటమ్ – అల్జీమర్స్ కు కారణమవుతుందని ఇది వరకే పరిశోధనలు ఆధారాలు చూపాయి. గరిష్టంగా మూడు నెలలలోపే టూత్ బ్రష్ హెడ్ లను మార్చాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.


నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం


నోటి పరిశుభ్రత ఉండడం వల్ల సాధారణంగా చిగుళ్ల సమస్యను నివారిస్తుంది. కానీ వయసు పెరిగే కొద్దీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటునే ఉంటుంది. కనీసం ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా డెంటిస్ట్ ను కలవాలి.


నోటి ఆరోగ్యానికి  చిట్కాలు



  • రోజుకు కనీసం రెండు సార్లు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసిన తర్వాత నీళ్లతో శుభ్రం చెయ్యవద్దు.

  • ఫ్లాస్ లేదా ఇంటర్ డెంటల్ బ్రష్ లను ఉపయోగించి ప్రతి రోజూ మీదంతాల మధ్య కూడా శుభ్రం చేసుకోవాలి.

  • ప్రతి నెల లేదా రెండు నెలల్లో తప్పకుండా టూత్ బ్రష్ మార్చుకుంటూ ఉండాలి.

  • గర్భవతులు, డయాబెటిక్స్ క్రమం తప్పకుండా డెంటిస్ట్ ను కలుస్తుండాలి.

  • పోగతాగే అలవాటుంటే మానేయ్యాలి.


Also read : Skin Cancer Test: స్మార్ట్ ఫోన్లతో చర్మ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? అదెలా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.