కరోనా తర్వాత డేంజర్ బెల్స్ మోగిస్తున్న ప్రాణాంతక వైరస్ 'మార్బర్గ్'. ఆఫ్రికాలో పుట్టిన ఈ భయంకరమైన వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎబోలా వైరస్ ఫిలో వైరస్ కుటుంబానికి చెందినది ఇది కూడా. టాంజానియాలో ఈ వైరస్ బారిన ఎనిమిది మందిలో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఈక్వటోరియల్ గినియాలో మొదటిసారిగా ఫిబ్రవరిలో వైరస్ ని గుర్తించారు. ఎబోలా వైరస్ మాదిరిగా ఇది కూడా వైరల్ హేమరెజిక్ ఫీవర్ కి కారణమవుతుంది. దీని వల్ల ప్రమాదకరమైన అంతర్గత రక్తస్రావం, అవయవాలు దెబ్బతినడం జరుగుతుంది.
యూఎస్ తో సహా అనేక దేశాలు గినియా, టాంజానియాకి వెళ్ళే ప్రయాణికులందరినీ ప్రాణాంతక వైరస్ సోకకుండా తగిన నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ వ్యాధికి చికిత్స లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మార్బర్గ్ వైరస్ వ్యాధి మరణాల రేటు 90 శాతం వరకు ఉంటుంది. లక్షణాలు అభివృద్ధి చెందడానికి కొన్ని రోజుల నుంచి మూడు వారాల వరకు పడుతుంది. వైరస్ సోకిన వ్యక్తి లేదా శవం నుంచి విడుదల అయిన ద్రవాలు, నోటి తుంపర్లు ద్వారా వ్యాపిస్తుంది.
మార్బర్గ్ వైరస్ అంటే ఏంటి?
సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మార్బర్గ్ వైరస్ అరుదుగా వచ్చే జ్వరం. ఫిలో వైరస్ కుటుంబానికి చెందినది ఇది. ఎబోలా కుటుంబానికి చెందినది.
లక్షణాలు
ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం మార్బర్గ్ వైరస్ మరణాల రేటు 23-90 శాతం మధ్య ఉంటుంది.
⦿ తీవ్ర జ్వరం
⦿ చలి
⦿ తలనొప్పి
⦿ మైయాల్జియా
⦿ ఛాతీ, వెనుక భాగంలో మాక్యులోపాపులర్ దద్దుర్లు
⦿ వికారం, వాంతులు
⦿ ఛాతీ నొప్పి
⦿ గొంతు మంట
⦿ పొత్తి కడుపు నొప్పి
⦿ అతిసారం
కొన్ని తీవ్రమైన లక్షణాలు
⦿ కామెర్లు
⦿ బరువు తగ్గిపోవడం
⦿ ప్యాంక్రియాస్ వాపు
⦿ మతిమరుపు
⦿ కాలేయ వైఫల్యం
⦿ తీవ్ర రక్తస్రావం
⦿ అవయవాలు పనిచేయకపోవడం
ఈ వ్యాధి లక్షణాలు కాస్త మలేరియా, టైఫాయిడ్ జ్వరంవంటి ఇతర అంటు వ్యాధుల మాదిరిగానే ఉంటాయియని వైద్యులు చెబుతున్నారు.
వైరస్ వల్ల ప్రమాదం
మార్బర్గ్ వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉంటే అది వారికి సోకుతుంది. ఇదొక అంటు వ్యాధి. ఆఫ్రికన్ ఫ్రూట్ జాతికి చెందిన గబ్బిలాల మూత్రం, మలం పట్టుకున్నా వైరస్ సోకుతుంది. గబ్బిలాలు తీసుకున్న ఆహార పదార్థాలు ఏదైనా కోతులు వంటి ఇతర జంతువులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మార్బర్గ్ కి ఎటువంటి నివారణ లేదా వ్యాక్సిన్స్ లేదు. కానీ వ్యాధి ప్రారంభంలోనే రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు చికిత్స తీసుకుంటే మంచిదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే ఈ వైరస్ వస్తే బతకడం చాలా కష్టం.
Also Read: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.