అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గడం మంచి విషయమే. ఎప్పుడూ కూడా హఠాత్తుగా బరువు తగ్గకూడదు. బరువు త్వరగా తగ్గుతున్నారంటే దానికి కచ్చితంగా కొన్ని కారణాలు ఉంటాయి.బరువు కోల్పోవడం అనేది స్థిరంగా సాగాలి తప్ప,హఠాత్తుగా జరగకూడదు. మీ బరువు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బరువు హఠాత్తుగా తగ్గుతూ, జుట్టు కూడా రాలుతోందంటే ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్టు అర్థం. సడెన్ గా బరువు తగ్గడం వెనుక దాగి ఉన్న ప్రమాద కారకాలు ఇవి కావచ్చు. 


థైరాయిడ్
థైరాయిడ్ సమస్యలు బరువు తగ్గడానికి, అలాగే పెరగడానికి కూడా కారణమవుతాయి. జీవక్రియలను నియంత్రించేది థైరాయిడ్ గ్రంథే. జీవక్రియల వేగం పెరిగినప్పుడు బరువు త్వరగా కోల్పోతారు. అలా వేగంగా ఉండడం హానికరం. అంటే థైరాయిడ్ అవసరమైనదాని కన్నా చురుకుగా పనిచేస్తుందన్నమాట. హృదయ స్పందన రేటు,ఎక్కువ ఆందోళన,వణుకు, నిద్రలేమి  వంటి సమస్యలు థైరాయిడ్ అతిగా పనిచేయడం వల్ల కలుగుతుంది. 


ఉదర వ్యాధులు
సెలియాక్ వ్యాధి, క్రోన్స్ వ్యాధి, లాక్టోజ్ ఇంటాలరెన్స్, పేగు సమస్యలు... ఇవన్నీ ఉదర వ్యాధుల కిందకి వస్తాయి. పేగు అవసరమైన పోషకాలను గ్రహించదు. ఇలాంటి వారు గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ వ్యాధుల వల్ల కూడా హఠాత్తుగా బరువు తగ్గిపోతారు. 


క్యాన్సర్
వేగంగా బరువు తగ్గడం అనేది క్యాన్సర్ సైడ్ ఎఫెక్టులలో ఒకటి. గ్యాస్ట్రిక్, పాంక్రియాటిక్, ఊపిరితిత్తులు, కొలెరెక్టర్ క్యాన్సర్లు సోకితే బరువు త్వరగా తగ్గి బలహీనంగా మారుతారు. అసహజంగా బరువు తగ్గినట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 


Also read: అన్నీ ఉన్నా ఆత్మహత్యలెందుకు? డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స ఉందా?


రుమటాయిడ్ ఆర్ధరైటిస్
శరీరంలో కీళ్లను ప్రభావిత దీర్ఘకాలిక రుగ్మత రుమటాయిడ్ ఆర్ధరైటిస్. ఇది సోకితే బరువు వేగంగా తగ్గిపోతారు. ప్రో ఇన్ ఫ్లమ్మేటరీ సైటోకిన్లు ఈ వ్యాధిలో మంటను, నొప్పిని పెంచుతాయి. శక్తిని అధికంగా ఖర్చయ్యేలా చేస్తాయి. ఎక్కువ కేలరీలు, కొవ్వును కాల్చేస్తాయి. దీంతో బరువు త్వరగా తగ్గిపోతారు. 


డ్రగ్స్ తీసుకునేవారిలో కూడా ఆకలి సరైన సమయానికి వేయదు. తినాలన్నా ఆసక్తి ఉండదు. దీని వల్ల వారు కూడా బరువు త్వరగా కోల్పోతారు. మద్యపానం, ధూమపానం అలవాటున్న వారు కూడా ఆహారాన్ని సరిగా తీసుకోరు. అలాగే ఈటింగ్ డిజార్డర్స్ కూడా బరువు తగ్గేందుకు కారణాలే. 


Also read: హైబీపీ ఉన్న వారికి కచ్చితంగా డయాబెటిస్ వస్తుందా? వచ్చే ఛాన్స్ ఎంత?



Also read: ఏడాదికి ఒక్కసారి రక్తదానం చేయండి చాలు, ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు