Lemon Water with Black Salt Benefits : నిద్రలేచిన వెంటనే పరగడుపుతో.. ఓ గ్లాసు నీటిలో నిమ్మరసం, నల్లు ఉప్పు కలిపి తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ.. హైడ్రేటెడ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుందట. ముఖ్యంగా సమ్మర్ మార్నింగ్స్​ని ఈ రొటీన్​తో స్టార్ట్ చేస్తే.. చాలామంచిదంటున్నారు. అంతేకాకుండా రాత్రుళ్లు నీటిలో నిమ్మరసం, తేనె, అల్లం, మిరియాల పొడి, పుదీనా, కీరదోస వేసి ఇన్​ప్యూజ్ చేసి ఉదయాన్నే బ్లాక్ సాల్ట్ కలిపి కూడా తాగొచ్చట. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. 


విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ డ్రింక్ తక్కువ కేలరీతో ఉంటుంది. కాబట్టి దీనిని బరువు తగ్గాలనుకునేవారు కూడా హాయిగా తీసుకోవచ్చు. దీనివల్ల బరువు తగ్గడమే కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, ఎసిడిటీని తగ్గించి.. జీర్ణ సమస్యలను దూరం చేస్తుందట. ఈ డ్రింక్​ రోజు తాగడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. మరి ఈ ఎనర్జీ డ్రింక్ శరీరానికి, చర్మానికి, ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందో ఇప్పుడు చూసేద్దాం. 


రోగనిరోధక శక్తికై.. 


నిమ్మరసంలో బ్లాక్​సాల్ట్​లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్​ఫెక్షన్లను దూరం చేసి.. శరీరాన్ని స్ట్రాంగ్​గా చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబు, జ్వరం వంటి లక్షణాలు దూరం చేస్తుంది. 


హైడ్రేషన్​ 


సమ్మర్​లో ఈ డ్రింక్ రెగ్యులర్​గా తీసుకుంటే.. శరీరం హైడ్రేటెడ్​గా ఉంటుంది. డీహైడ్రేషన్ ఎన్నో ఆరోగ్య సమస్యలను తెస్తుంది. అందుకే శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హైడ్రేషన్​తో ఉంటే ఆరోగ్య సమస్యలను దూరం అవ్వడమే కాకుండా.. శక్తి అందుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. 


బరువు తగ్గడంలో.. 


నిమ్మరసంలో షుగర్​కి బదులు బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల దీనిని హెల్తీ డ్రింక్​గా మారుతుంది. షుగర్​ని అవాయిడ్ చేస్తే బరువు కంట్రోల్ అవుతుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ మంచి ఎనర్జీని ఇస్తుంది. మెటబాలీజం పెంచి.. ఫ్యాట్ బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఫుడ్ క్రేవింగ్స్​ని దూరం చేస్తుంది. 


హార్మోనల్ సమస్యలు దూరం


హార్మోనల్ సమస్యలతో బాధపడేవారు ఈ డ్రింక్​తో వాటిని సమతుల్యం చేసుకోవచ్చు. నిమ్మకాయలు మంచి హార్మోన్లను పెంచి.. ఒత్తిడిని తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటిలోని విటమిన్ సి ఒత్తిడిని తగ్గించి.. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. 


క్లియర్ స్కిన్


ఈ డ్రింక్​లోని విటమిన్ సి మీకు క్లియర్, గ్లోయింగ్ స్కిన్​ని అందిస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని క్లియర్ చేస్తాయి. పింపుల్స్​ని దూరం చేయడంతో పాటు.. వృద్ధాప్యఛాయలను లేట్ చేస్తాయి. డ్రింక్ హైడ్రేషన్​ని అందిస్తుంది కాబట్టి స్కిన్ మెరుస్తూ ఉంటుంది. 


క్యాన్సర్ రాకుండా.. 


రెగ్యులర్​గా నిమ్మరసంతో కూడిన నీటిని తీసుకుంటే క్యాన్సర్ సమస్యలు తగ్గుతాయని పలు అధ్యయానాలు నిరూపించాయి. ఈ డ్రింక్​లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. ఇవి శరీర కణాలు డ్యామేజ్ కాకుండా ఫ్రీరాడికల్స్​ నుంచి రక్షిస్తాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ సమస్యలను దూరం చేస్తాయి. 


కిడ్నీలో రాళ్లు.. 


సమ్మర్​లో చాలామందికి డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అలాంటి వారు సమస్యను తగ్గించుకోవడానికి.. ఈ డ్రింక్​ని తీసుకోవచ్చు. నిమ్మకాయల్లోని సిట్రిక్ యాసిడ్.. కిడ్నీ రాళ్లను యూరిన్​ ద్వారా పంపించడంలో హెల్ప్  చేస్తుంది. శరీరంలో pH లెవెల్స్​ని బ్యాలెన్స్ చేస్తుంది. శరీరాన్ని టాక్సిన్లు తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. 



సైడ్ ఎఫెక్ట్


బ్లాక్ సాల్ట్ సోడియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలను తగ్గిస్తుంది. అయితే దీనిని మితంగా తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. అధిక ఉప్పు రక్తపోటు ఆరోగ్య సమస్యలను దారి తీస్తుంది. లిమిట్​గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ డ్రింక్​ని రోజూ తీసుకోవాలనుకుంటే.. వైద్యుల సూచనలు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read : వేసవికాలంలో బీపీ, షుగర్, ఆస్తమా పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.