Satyabhama Serial Today Episode సంధ్య, సంజయ్ భుజం మీద వాలిపోయి ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇంతలో సంజయ్‌కి రూప కాల్ చేస్తుంది. సంజయ్ సంధ్యని చూసి కట్ చేస్తాడు. దాంతో సంధ్య పర్లేదు మాట్లాడు అంటుంది. రూప మళ్లీ కాల్ చేస్తుంది. సంజయ్ కట్ చేస్తాడు. నీ చేతి కాఫీ కావాలని సంధ్యని పంపిస్తాడు. తింగరి ఏం చెప్పినా నమ్మేస్తుంది ఇలాంటి వాళ్లని నా కోసమే దేవుడు పుట్టిస్తాడు అనుకుంటాడు. 


సంజయ్ రూపకి కాల్ చేస్తాడు. డార్లింగ్ అని మాట్లాడుతూ నీతో రిలేషన్ కట్ చేయలేదని మాట్లాడుతాడు. రూప సంజయ్‌తో మీ ఇంటికి వస్తున్నా అని చెప్తుంది. సంజయ్ ఎంత చెప్పినా రూప ఇంటికి వస్తానని అంటుంది. ఇక సంజయ్ మహాదేవయ్యని బుట్టలో వేసి రూపకి  ఇవ్వడానికి డబ్బు రెడీ చేసుకోవాలి అనుకొని కింది వెళ్లి మహదేవయ్య కాళ్లు మొక్కతాడు. 



మహదేవయ్య: పిల్లలు కాలు మొక్కినప్పుడు పిల్లల చేతికి ఏదో ఒకటి ఇయ్యాలే.
భైరవి: కాఫీ కప్పు ఇవ్వండి పోయి కిచెన్లో పెడతాడు.
మహదేవయ్య: నేను చెప్పింది ఎంతో కొంత పైసలు ఇవ్వాలని. లోపలకి పోయి 10 వేలు తీసుకొచ్చి చేతిలో పెట్టు.
భైరవి: పది వేలా.
సంజయ్: వద్దు బిగ్ డాడ్. 
భైరవి: ఎంత బుద్ధిమంతుడో చూడు.
సంజయ్: అంటే అది నాకు పది కోట్లు కావాలి. అందరూ నోరెళ్ల బెడతారు. 
భైరవి: అదేంట్రా పెళ్లి, ఫస్ట్‌నైట్ సీమంతం ఇలాంటివి మీ పెద్దయ్యకి అడగాలి. ఇలాంటివి మీ సొంత అయ్యకి అడగాలి అర్థమైందా.
మహదేవయ్య: నువ్వేం పికర్ చేయకురా పది కోట్లు నేను సిద్ధం చేస్తా.
సంజయ్: థ్యాంక్యూ బిగ్ డాడ్.
క్రిష్: బాపు ఎందుకో పిలిచావ్ అంట.
భైరవి: వచ్చి కాళ్లకి దండం పెడతావేమో పది కోట్లు ఇద్దామని పిలిచాడు అంతేలే పెనిమిటి.
మహదేవయ్య: జర నీ కడుపు మంట ఆపుతావా.


మహదేవయ్య తమ 2 ఎకరాల కబ్జా ల్యాండ్ అనుకుంటా కలెక్టర్ పేదలకు పంచుతా అంటున్నాడు నువ్వు వెళ్లి వాడికి దమ్మీఇచ్చి రా అంటాడు. క్రిష్ సత్యని చూస్తాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. తర్వాత వచ్చి నేనే ఒక్కడినే పోతా అని అంటాడు. దాంతో మహదేవయ్య పది మందిని తీసుకెళ్లు నీకు దండం పెట్టాలి వాడు అని అంటాడు. అన్నింటికి బెదిరించకుండా చక్కగా చెప్తే మాట వింటారని అంటాడు. కొత్తగా మాట్లాడుతున్నాడని భైరవి అంటుంది. నీతో అవ్వకపోతే ఇంట్లో కూర్చొరా అని మహదేవయ్య అంటాడు. అన్నింటికీ గొడవలు అవసరం లేదని క్రిష్ అంటాడు. క్రిష్ నీ కోసం మారుతున్నాడు ఎందుకు దూరం పెడుతున్నావు అని బామ్మ, రేణుక సత్యని అడుగుతారు. క్రిష్‌ని బాధ పెట్టడం అంటే నన్ను నేను బాధ పెట్టుకోవడమే అని క్రిష్‌ని వదిలేస్తే మళ్లీ బాపు చేతిలోకి వెళ్లిపోతాడని మార్పు వచ్చేవరకు ఇలా కఠినంగా ఉండాలని అంటుంది. 


రూప ఇంటికి రాగానే సంజయ్ పక్కకి లాక్కొస్తాడు. నీ కోసం బిగ్ డాడీకి డబ్బు అడిగా సెటిల్ చేస్తా అని చెప్తాడు. ఇక సంజయ్ రూపతో క్లోజ్‌గా భుజం మీద చేయి వేసి మాట్లాడుతాడు. క్రిష్ దూరం నుంచి చూస్తాడు. రూపని గుర్తు తెచ్చుకొని షాక్ అయిపోతాడు. సత్య మీద కోపంతో సంధ్యకి లైన్ వేశా పడిపోయింది తిక్కది అని అంటాడు. మూడు నాలుగు రోజుల్లో సంధ్యని వదిలించుకుంటున్నా అని అంటాడు. క్రిష్ ఆ మాటలు విని షాక్ అయిపోతాడు. సంధ్యని చంపేయబోతున్నా అని పెళ్లాంగా నువ్వు ఉంటావ్ కదా నాకు అది చాలు అంటాడు. ఇక సంజయ్ రూపని కిస్ చేసుకోబోతే క్రిష్‌ సంజయ్‌ని చితక్కొడతాడు. నువ్వు మోసం చేసింది సంధ్యనే కాదు నన్ను కూడా అని కొడతాడు.


సంధ్యని చంపేస్తావా పదరా లోపలికి చంపేయ్ అని అంటే సంజయ్ తప్పు  చేశానని లెంపలేసుకుంటాడు. ఫస్ట్‌నైట్ అవ్వకపోయి ఉంటే నిన్ను చంపేసేవాడినని అంటాడు. దాంతో సంజయ్ సంధ్యని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అని ప్రామిస్ వేస్తాడు. క్రిష్‌ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత సంజయ్ క్రిష్‌ కంట్లో రక్తం కారేలా చేయకపోతే నా పేరు సంజయ్‌నే కాదని అంటాడు. మరోవైపు మహదేవయ్య క్రిష్ తన చేయి జారిపోయాడేమో అని అనిపిస్తుందని అనుకుంటుంది. ఇంతలో భైరవి వచ్చి నీ పద్ధతి నచ్చడం లేదని కడుపున బిడ్డకి దారి తీరు లేదు కానీ పరాయి వాడి కొడుకుకి కోట్లు ఇస్తావా అని ప్రశ్నిస్తుంది. పెద్దోడు బెయిల్‌లో ఉన్నాడు. చిన్నా నీ వెంటే తిరుగుతున్నాడు వాడి జీవితం చూడు ఆ సంజయ్‌ గాడు ఇంట్లో ఉండటం ఇష్టం లేదని పంది కొక్కులా ఇంట్లో తింటూ ఉంటే నాకు ఇష్టం లేదని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!