Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషాని అంతు చూడటానికి లక్ష్మీ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు రైడ్‌కి పిలుస్తుంది. లక్ష్మీ కంపెనీ లెక్కలన్నీ సరిగ్గా ఉంటాయి. మనీషా కాస్మోటిక్స్ కంపెనీ లెక్కలు రెండు ఏళ్లగా సరిగా లేకపోవడంతో లెక్కలు చెప్పడానికి మనీషాని అధికారులు తమతో పాటు దిల్లీ రావాలని చెప్తారు. రాను అంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తామని అంటారు. మనీషా బిత్తరపోతుంది.  


రాజేశ్వరిదేవి: చూడబోతే ఇదంతా లక్ష్మీ పనిలాగే ఉంది.

లక్ష్మీ: ఏంటి మనీషా మీ ఆడిటర్ ఏం చేస్తున్నాడు తనకు నువ్వు సరిగా సాలరీ ఇవ్వడం లేదా.

మనీషా: లేదు నేను ప్రతీ నెల లెక్కలు చూస్తున్నా.

లక్ష్మీ: నువ్వు చూస్తున్నా ఇలా అయింది అంతే అంతా నీకు తెలిసే జరిగిందా. 

మనీషా: ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మిత్ర. ఎక్కడో ఏదో కుట్ర జరిగింది.

లక్ష్మీ: మనీషా వివరణ ఇవ్వడానికి మీ హెడ్ ఆఫీస్‌కి రావాలి కదా సార్. 

అధికారులు: అవును మీరు మాతో వెంటనే రావాలి. 

లక్ష్మీ: పాపం మనీషాకి ఇక్కడ ఎన్నో పనులు ఉంటాయి కదా సార్ ఎలా వస్తుంది.

అధికారులు: రాకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. 

దేవయాని: మనీషా ఇరుక్కుందా లేక లక్ష్మీ ఇరికించేసిందా.

 

మిత్ర అధికారులకు కాస్త టైం అడుగుతాడు. మనీషా తరఫున హామీ ఇస్తాడు. రెండు రోజులు గడువు ఇవ్వమని అడుగుతాడు. దాంతో అధికారులు రెండు రోజులు టైం ఇస్తారు. తర్వాత మిత్రనే మనీషాని తీసుకొచ్చి సరెండర్ చేయమని అంటారు. మనీషా చెమటలు పట్టేస్తుంది. అందరూ మనీషాని చూసి చిరాకు పడతారు. నీ పని అయిపోయిందని సెటైర్లు వేస్తారు. మనీషా గదిలోకి వెళ్లి కోపంతో రగిలిపోయి తన ఎదురుగా ఉన్నా కాస్మోటిక్స్ అన్నీ విసిరికొడుతుంది. మనీషాని దేవయాని ఆపుతుంది. అంతా లక్ష్మీనే చేసిందని రాత్రికి రాత్రే ప్లాన్ చేసిందని ఇంట్లో వాళ్ల ముందు పరువు తీసిందని అంటుంది. లక్ష్మీ గుట్టు చప్పుడు కాకుండా అన్నీ చేసేసిందని దేవయాని లక్ష్మీని పొగుడుతుంది. ఒక్కసారి నువ్వు ఇంటి గుమ్మం దాటితే నీ పని అయిపోతుందని అంటుంది. లక్ష్మీకి కచ్చితంగా టిట్ ఫర్ ట్యాట్ చేస్తానని అనుకుంటుంది. 

 

జాను వంట గదిలోకి వెళ్లి ఏం వండాలా అనుకొని మామిడి కాయ పప్పు వండాలని అనుకుంటుంది. ఇంతలో వివేక్ రావడంతో కావాలనే మామిడి కాయ దాచేస్తుంది. ఏంటి చూపించు అని వివేక్ అడుగుతాడు. ఇద్దరూ ఆడుకుంటూ హాల్‌లోకి వచ్చేస్తారు. దేవయాని తిడుతుంది. ఇక రాజేశ్వరి దేవి పచ్చి మామిడి కాయని చూసి జాను ప్రెగ్నెంట్ అని అనుకుంటుంది. ఆ విషయం వివేక్, దేవయానిలకు చెప్తుంది. వివేక్‌కి జోక్ చేద్దామని అనుకుంటే విషయం సీరియస్‌ అయిపోయిందని జాను అనుకుంటుంది. మనీషా పై నుంచి ఆ తతంగం చూస్తుంది. దేవయాని జానుతో పెళ్లి అయి ఇన్ని నెలలు అయినా ఎందుకు నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు. నీకు ఏం విశేషం లేదు అంటే నీలో ఏదో లోపం ఉందని అంటుంది. జాను షాక్ అయిపోతుంది. చాలా బాధ పడుతుంది. రాజేశ్వరదేవితో ఇది కూడా నీలా పిల్లలు లేకుండా మిగిలిపోతుందేమో వదిన అని సీరియస్ అయి దీనికి ఆ రాతలేదని తిట్టి వెళ్లిపోతుంది. జాను బాధ పడి వెళ్లిపోతుంది. రాజేశ్వరి దేవి కూడా బాధపడుతుంది. 

 

వివేక్ జాను దగ్గరకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేస్తే మీ అమ్మని సపోర్టు చేయొద్దని అంటుంది. వివేక్ కూడా జానుతో ఒకసారి మనిద్దరం టెస్ట్ చేయించుకుందాం అంటే జాను హర్ట్ అయివెళ్లిపోతుంది. హాల్‌లో ఏడుస్తున్న రాజేశ్వరిదేవి దగ్గరకు వివేక్ వెళ్తాడు. సారీ చెప్తాడు. అమ్మ అలా అనకుండా ఉండాల్సిందని అంటాడు. దాంతో రాజేశ్వరి దేవి మిత్ర, నిన్ను చూసుకొని నా పిల్లలు అనుకున్నా నాలా జాను అవ్వకూడదు. జానుకి పిల్లలు పుట్టకపోతే జీవితాంతం మీ అమ్మ వేపుకు తింటుందని అంటుంది. ఇక దేవయాని కూడా జాను టెస్ట్‌లు చేయించుకోకపోతే గెంటేస్తానని అంటుంది. ఇంతలో మనీషా దేవయాని దగ్గరకు వచ్చి నా ప్రాబ్లమ్‌కి మీ వల్ల సొల్యూషన్ దొరికిందని అంటుంది. మనీషా తాను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి ఇంటిని వణికిస్తానని అంటుంది. లక్ష్మీ డీప్‌గా ఎంక్వైరీ చేస్తుందని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని అంటుంది. 

 

మిత్ర లక్ష్మీ దగ్గరకు వచ్చి రేపు మనీషాతో నేను దిల్లీ వెళ్తానని అంటాడు. వివేక్ వెళ్తాడని లక్ష్మీ అంటుంది.  మనీషా ఎలాంటి పరిస్థితి అయినా హ్యాండిల్ చేయగలదు అని లక్ష్మీ  అంటుంది. దాంతో మనీషా వచ్చి నేను ఎలాంటి పరిస్థితి అయినా హ్యాండిల్ చేస్తానని నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికీ భయపడను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!