Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్ర కాళ్లు పట్టుకున్న లక్ష్మీ.. పెళ్లి విషయం ఇంట్లో చెప్పేస్తానని నిర్ణయించుకున్న విహారి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి లక్ష్మీకి న్యాయం చేయడానికి తన పెళ్లి విషయం ఇంట్లో వాళ్లకి చెప్పేస్తానని లక్ష్మీతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి కనక మహాలక్ష్మీని పిలుస్తాడు. నీ గురించి ఆలోచించకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇబ్బందిగా ఉందని మీ నాన్నని పిలు మాట్లాడి జరిగిందంతా చెప్పి నిన్ను అప్పగిస్తానని అంటాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది.
లక్ష్మీ: ఆయనకు ఆ నిజాన్ని తట్టుకునే శక్తి ఉంటే మీరు ఎయిర్ పోర్ట్‌లో వదిలేసినప్పుడే వెళ్లిపోయేదాన్ని.
విహారి: సరే ఇది కాకపోతే ఇంకో దారి ఏంటి. సరే ఒక పని చేస్తా రేపు ఉదయం మా ఇంట్లో అందరికీ నిన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పేస్తా.
లక్ష్మీ: విహారి బాబు గారు మీరు ఆ విషయం చెప్తే పద్మాక్షి అమ్మ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించగలరా. సహస్రమ్మ తట్టుకోగలరా. యమునమ్మని పెద్దావిడ, అంబికమ్మ ఊరుకుంటారా. మీ కుటుంబం మళ్లీ విడిపోతుంది.
విహారి: నేను నా ఫ్యామిలీకి సర్ది చెప్తాను. మీ నాన్న దగ్గరకు తీసుకెళ్లి అందరితో సారీ చెప్పిస్తాను.
లక్ష్మీ: విహారి గారు నేను ఇక్కడున్న పరిస్థితిలో మీ ఇంటి వారు గానీ మా నాన్న గానీ ఎవరూ నాకు న్యాయం చేయలేరు. నాకు న్యాయం చేసేది ఆ దేవుడే. ఈ నిజం మా నాన్నకి తెలిస్తే ఆయనతో పాటు మొత్తం మూడు ప్రాణాలు పోతాయి. అందుకు మీరే కారణం అవుతారు. అది నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు ఈ నిర్ణయం వెనక్కి తీసుకోండి.
ఉదయం సహస్రని తన ఫ్రెండ్స్ పెళ్లి కూతురిలా రెడీ చేస్తారు. అందంగా ఉన్నావని ఇప్పుడే మీ బావ ఇలా చూస్తే తాళి కట్టేస్తాడని అంటుంది. ఇరవై ఏళ్ల తర్వాత బావని చూశాను మొదటి సారి చూసినప్పుడే మిగతా 80 ఏళ్లు ఊహించుకున్నానని బావని లేటుగా చూపించినందుకు అమ్మనే తిట్టుకున్నానని అంటుంది. ఇక లక్ష్మీ అక్కడికి రావడం చూసిన సహస్ర ఫ్రెండ్స్ లక్ష్మీ ఆ రోజు పార్టీ పాడు చేసింది. ఇప్పుడు నీ జీవితం నాశనం చేయకుండా చూడని అంటారు. దాంతో సహస్ర జ్యూస్ తన కాళ్ల మీద చల్లుకొని లక్ష్మీని పిలిచి చెప్పులు క్లీన్ చేయమని అంటుంది. పని మనిషి చెప్పింది చేయాలని సహస్ర ఫ్రెండ్స్ అనడంతో లక్ష్మీ సహస్ర కాళ్ల చెప్పు తీసి కాళ్లు క్లీన్ చేసి చెప్పులు క్లీన్ చేస్తుంది. సహస్ర పొగరుగా ఎవరి స్థాయి బట్టి వాళ్ల స్థానం తెలుసుకోవాలని అంటుంది. లక్ష్మీ చెప్పు తుడుస్తుంటే సహస్ర కాళ్లు ముఖం మీద పెట్టి ఆడిస్తుంది. ఇంతలో యమున సహస్ర కోసం వచ్చి లక్ష్మీని చెప్పులు తుడవడం చూసి ఆపుతుంది.
సహస్ర: అత్తయ్య పని మనిషి పని చేస్తుంటే ఆపుతారేంటి.
యమున: లక్ష్మీ పని మనిషి కాదు నా మనిషి. నాకు సాయం చేయడానికి వచ్చిన మనిషి.
లక్ష్మీ: యమునమ్మ గారు ఈ విషయం వదిలేయండి.
సహస్ర: ఏంటి అత్తయ్య లక్ష్మీని సపోర్ట్ చేస్తున్నారు.
యమున: మరి మీరు అందరూ ఏకమై తనని ఏడిపిస్తున్నారు.
సహస్ర: పని చేయడానికి తనకు ఏం బాధ లేదు. మీరు ఏంటి కాబోయే కోడలి కంటే తనకి సపోర్ట్ చేస్తున్నారు.
యమున: అదేం లేదమ్మా నువ్వు అంటేనే నాకు ఇష్టం.
సహస్ర ఫ్రెండ్స్ గొడవ వద్దని అంటారు. ఇంకా ఎన్నో పనులు ఉన్నాయని లక్ష్మీ వెళ్లిపోతుంది. లక్ష్మీని మీ చేతితోనే బయటకు పంపేసేలా చేస్తానని అనుకుంటుంది. పెళ్లి పందరి చూస్తూ భక్తవత్సలం, కాదాంబరి మురిసిపోతారు. విహారి వల్లే ఇదంతా సాధ్యం అయిందని అందరూ విహారి పొడుగుతారు. యమున మాట్లాడుతుంటే పద్మాక్షి యమునను సూటిపోటి మాటలు అంటుంది. పాతికేళ్ల తర్వాత పుట్టింటి గుమ్మం తొక్కే పరిస్థితి యమున తీసుకొచ్చిందని అంటుంది. ఇక మదన్ వచ్చి అందరినీ నవ్విస్తాడు. విహారి కూడా అక్కడికి వస్తాడు. పెళ్లి కొడుకులా విహారిని చూసి అందరూ సంతోషిస్తారు. మదన్ అందరితో ఈ పెళ్లి అయిపోయిన తర్వాత మండపం ఇలాగే ఉంచేయండి నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. అందరూ సరదాగా నవ్వుకుంటారు. సత్య రావడంతో విహారి గదిలోకి వెళ్లిపోతాడు. విహారి సత్యతో కనక మహాలక్ష్మీకి ఏం న్యాయం చేయలేకపోతున్నా అని బాధపడతాడు. లక్ష్మీ చాటుగా విహారి వాళ్ల మాటలు వింటుంటుంది. మరోవైపు విహారిని వెతుక్కుంటూ యమున వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. భర్తకి అండగా దీప.. సమస్యల ఊబిలో జ్యోత్స్న!