Actor Dhanraj on sudigali Sudheer health: జబర్దస్త్ కామెడీ షోతో టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). ఆ తర్వాత అటు యాంకర్‌గా ఇటు సినిమాల్లోనూ హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే.. అటు సినిమాల్లోనూ బిజీ అయ్యారు. తాజాగా, ఆయన ధన్‌రాజ్ నటించిన 'రామం రాఘవం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఆయన బాగా నీరసించిపోయి సన్నగా కనిపించారు. దీంతో సుధీర్‌కు ఏమైందా.? అంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. వేడుకలో ప్రసంగించిన సుధీర్.. ధనరాజ్‌కు తనకు మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మైక్ అందుకున్న ధనరాజ్ (Dhanraj) సుధీర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు.
'ఆరోగ్యం బాగాలేకపోయినా నా కోసం వచ్చాడు'
సుధీర్‌కు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదని.. అయినా తన కోసం ఈవెంట్‌కు వచ్చినట్లు ధనరాజ్ (Dhanraj) తెలిపారు. 'ఆరోగ్యం బాగాలేకపోయినా నేరుగా ఆస్పత్రి నుంచి నా కోసం సుధీర్ వచ్చాడు. 3 రోజుల నుంచి తనకు మాట్లాడడానికి మాట కూడా రావట్లేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి వస్తున్నావా.? అని అడిగితే కచ్చితంగా వస్తానని చెప్పాడు. నేను బాగుండాలి అని కోరుకునే వ్యక్తుల్లో సుధీర్ మొదట ఉంటాడు. అతని చాలా మొహమాటం. ఆఖరికి తన ఫంక్షన్స్‌కు వెళ్లడానికి సైతం చాలా ఆలోచిస్తాడు. అలాంటి నా కోసం వచ్చాడు. మళ్లీ ఇప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి కాబట్టి వెంటనే వెళ్లిపోతాడు.' అని చెప్పారు. దీంతో సుధీర్‌కు ఏమైందో.? అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
'తండ్రీ కొడుకుల సంఘర్షణ రామం రాఘవం'
దనరాజ్ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్‌లో నటించిన మూవీ 'రామం రాఘవం'. ఈ సినిమాలో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ అరిపాక సమర్ఫణలో నిర్మిస్తున్నారు. 'విమానం' దర్శకుడు యానాల శివప్రసాద్ కథ అందించారు. ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇటీవల ప్రముఖ హీరో నాని ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, వాసు ఇంటూరి, సత్య, పృథ్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, సునీల్, రాకెట్ రాఘవ, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. కొడుకు గొప్పగా సెటిలై మంచి పేరు తెచ్చుకోవాలనుకుని ఆశించే ఓ తండ్రి.. తండ్రిని అర్థం చేసుకోకుండా అప్పులు చేసుకుంటూ తిరిగే ఓ కొడుకు. ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణే కథాంశంగా సినిమా రూపొందించారు.
Also Read: 'తెలుగు సినిమా సెట్‌లో బాడీ షేమింగ్ చేశారు' - అప్పుడే ఎక్కువ బాధ పడ్డానన్న శ్వేతాబసు ప్రసాద్