Summer Health Tips for BP, Sugar, and Asthma Patients : ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని విషయాలు అస్సలు విస్మరించవద్దని సూచిస్తున్నారు నిపుణులు. మధుమేహమున్నవారు, బీపీ పేషెంట్లు, ఆస్తమా రోగులు సమ్మర్లో కొన్ని విషయాల పట్ల కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని.. లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మరి బీపీ, షుగర్, ఆస్తమా పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
బీపీ పేషెంట్లు..
రక్తపోటు సమస్యలున్నవారు సమ్మర్లో కొన్ని సూచనలు రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. ఇవి బీపీ పెరగకుండా హెల్ప్ చేస్తాయి. అవేంటంటే..
హైడ్రేషన్ : శరీరం డీహైడ్రేషన్ కాకుండా.. నీళ్లు తాగాలి. ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాలి. ఇది శరీరంలో బీపీని కంట్రోల్ చేసి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
ఒత్తిడి : ఎండకాలంలో వేడి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఉష్ణోగ్రతల వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో (ఉదయం 10-సాయంత్రం 4) ఇంట్లో ఉంటే మంచిది. ఫ్యాన్, ఏసీ వంటి కూలింగ్ పరికరాలు ఉపయోగించుకోవాలి.
చెకప్స్ : రక్తపోటు ఎంత ఉందో రోజూ చెక్ చేస్తూ ఉండాలి. దానికి అనుగుణంగా మందులు, జీవనశైలి అలవాట్లు సర్దుబాటు చేసుకోవాలి.
డైట్లో : వేడిని దూరం చేసి.. బీపిని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. దోసకాయలు, సెలరీ, పెరుగు వంటి ఫుడ్స్ డైట్లో తీసుకుంటే మంచిది. ఇవి వేడిని తగ్గించడంతో పాటు.. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి.
మధుమేహమున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హైడ్రేషన్ : ఎండవేడిని తట్టుకునే శక్తిని శరీరానికి అందించేలా నీటిని తాగుతూ ఉండాలి. ఇది డీహైడ్రేషన్‌ని తగ్గిస్తూ.. షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
ఆ డ్రింక్స్ వద్దు : ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు హైడ్రేషన్ కోసం షుగర్ డ్రింక్స్ తీసుకుంటారు. జ్యూస్ సోడా, టీ వంటివి డీహైడ్రేషన్‌ని పెంచి.. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి.
చెకప్స్ : బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయో రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా లైఫ్‌స్టైల్, ఫుడ్స్ మార్చుకోవాలి. మందులు తప్పకుండా ఉపయోగించాలి.
డైట్ : ఫుడ్‌ని ఒకేసారి కాకుండా.. తక్కువగా ఎక్కువసార్లు తినాలి. తీసుకునే కేలరీలను లెక్కించి.. దానిని డివైడ్ చేసుకోవాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బయటకి వెళ్లొద్దు : ఉదయాన్నే 5 నుంచి 10వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఆ సమయంలో ఆస్తమా రోగులు అలెర్జీలకు ఎక్కువగా గురి అవుతారు. కాబట్టి ఉదయాన్నే బయటకి వెళ్లకపోవడమే మంచిది.
ఏసీలు : అలెర్జీలు, కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయడంలో హెల్ప్ చేసే ఎయిర్ కండీషనర్లు ఉపయోగిస్తే మంచిది. ఇంట్లో, కారులో ఇవి ఉండేలా చేసుకోండి.
ఆ పనులు వద్దు : ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయకండి. వాటివల్ల ఉబ్బసం లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి వేడి ఎక్కువగా ఉన్న సమయంలో శారీరక శ్రమను పరిమితం చేయాలి.
ఇన్హేలర్ : ఎక్కడికి వెళ్లినా.. ఇంట్లో ఉన్నా ఇన్హేలర్ అందుబాటులో ఉండేలా చూసుకోండి. వైద్యులు సూచించిన సలహాలు ఫాలో అవ్వాలి.
మరిన్ని జాగ్రత్తలు
బయటకు వెళ్లినప్పుడు తేలికగా ఉండే, లూజ్ ఫిట్టింగ్ ఉండే దుస్తులు ధరించండి. టోపీలు, సన్‌గ్లాసెస్ ఉపయోగించడం వల్ల ఎండవేడిని తగ్గించుకోవచ్చు. SPF 30 సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. నీటిని తరచూ తాగుతూ ఉండండి. మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి అస్సలు వెనకాడకండి.
Also Read : క్యాన్సర్ వచ్చే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే.. దద్దుర్లు నుంచి అలసట వరకు, అస్సలు ఇగ్నోర్ చేయకండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.