కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనే వాదన ఇప్పటికీ వినిపించే మాట. తాజాగా వచ్చిన ఒక అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. కరోనా తర్వాత చాలా మంది పిల్లలకి టైప్ 2 నిర్ధారణ అయ్యిందని కొత్త అధ్యయనం చెబుతోంది. యూఎస్ లోని ఇల్లినాయిస్ లో జరిగిన ఎండోక్రైం సొసైటీ వార్షిక సమావేశంలో ENDO-2023 లో ఈ అధ్యయనం గురించి ప్రస్తావించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో గర్భం దాల్చిన గర్భిణీలు జెస్టేషనల్ డయాబెటిస్ అభివృద్ధి చేసినట్లు నివేదికలు చూపించారు.


కొలంబస్, ఒహియోలోని నేషన్ వైడ్ చిల్డ్రన్ హాస్పిటల్ పరిశోధకులు ప్రవేశపెట్టిన మరొక అధ్యయనం ప్రకారం కోవిడ్ మహమ్మారి మొదటి సంవత్సరంలో పాఠశాలలు మూసివేయడంతో పిల్లలు ఆటలు, ఇతర విషయాల్లో చురుకుగా పాల్గొనలేదు. తరచుగా స్నాక్స్ తినడం, అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వంటివి వాటి వల్ల బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్ రావడానికి దారి తీసింది. రెట్రోస్పెక్టివ్ అధ్యయనం ప్రకారం కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరంలో యువత దాదాపు 24.8 శాతం మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. రెండో ఏడాది 18.9 శాతం, మూడో ఏడాది 32.1 శాతం మంది మధుమేహం బారిన పడినట్టు పరిశోధకులు వెల్లడించారు.


ఈ పెరుగుదల మహమ్మారి సంబంధిత పరిస్థితులు, జీవనశైలిలో మార్పుల వల్ల మాత్రమే కాదని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీనికి కారణాలు పూర్తిగా తెలియవు, మరిన్ని లోతైన పరిశోధనలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవి పరిగణలోకి తీసుకుని యువత అప్రమత్తంగా ఉండాలి. జన్యుపరమైన పరిస్థితులు, ఊబకాయం, తక్కువ చురుకుగా ఉన్న వాళ్ళు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే వైద్యులని సంప్రదించడం ముఖ్యమని హెచ్చరిస్తున్నారు. దాహం పెరగడం, తరచుగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు మధుమేహానికి సంకేతాలు.


రెండవ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధన బృందం కోవిడ్ 19 ముందు రెండేళ్లలో జరిగిన 14,633 గర్భాలని పరిశీలించారు. అందులో మొదటి సంవత్సరంలో 6,890, రెండో ఏడాది 6,654 పరిశీలించారు. పాపులేషన్, కోవిడ్ మహమ్మారి పరిస్థితుల కారణంగా గర్భధారణ సమయంలో మధుమేహం కనిపించింది. ఇది తల్లులు, పిల్లలపై స్వల్ప కాలం, దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  ప్రీ ప్రేగ్నన్సీ సమయంలో బాడీ మాస్ ఇండెక్స్, ఒబేసిటీ, ఇతర కారణాలు జేస్టేషనల్ డయాబెటిస్ పరిస్థితి రావడానికి దారి తీసాయి. మహమ్మారి వచ్చిన మొదటి, రెండో ఏడాది టైమ్ లో ఈ జేస్టేషనల్ డయాబెటిస్ కేసులు పెరిగాయి. మహమ్మారికి ముందు 21 శాతం ఉన్న కేసులు రెండో సంవత్సరంలో 25 శాతానికి పెరిగాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: చైనీయులు పంచదార చాలా తక్కువ తింటారట.. ఎందుకో తెలుసా?