మన దేశంలో పంచదారతో చేసిన స్వీట్స్ అంటే చాలా మందికి పిచ్చి. కొంతమంది ఇళ్ళల్లో ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ లో స్వీట్స్ ఉండేలా చూసుకుంటారు. కానీ చైనా మనకి పూర్తి విరుద్ధం. ప్రపంచం మొత్తం మీద తీసుకునే చక్కెర వినియోగంలో కూడా చైనా చాలా తక్కువగా తీసుకుంటుంది. కొన్ని ఆన్ లైన్ నివేదికల ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో చైనాలో రోజువారీ చక్కెర వినియోగం 30.4 గ్రాములు. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు సగం తక్కువ. యునైటెడ్ స్టేట్స్ లో ఆ సంఖ్య 84.7 గ్రాములు కాగా యూఏఈ లో 79.2 గ్రాములు, ఇక మన దేశంలో 51.2 గ్రాములు.


చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, దంత క్షయంతో పాటు అనేక రోగాలను ఆహ్వానించినట్టే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పెద్దలు, పిల్లు రోజువారీ మొత్తంగా దాదాలు 50 గ్రాముల(12 టీ స్పూన్లు) కంటే తక్కువగా తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది. ప్రపంచంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి. బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ చక్కెర ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. అయితే చక్కెరకి చైనా మాత్రం అంతగా ప్రాధాన్యత ఇవ్వదు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చక్కెర, తీపి ఆహారానికి చైనీయులు తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సూపర్ మార్కెట్ లో లభించే చక్కెర పానీయాలు, దుకాణాలలో గ్రాన్యూలేటెడ్ వైట్ కాన్ షుగర్ చిన్న ప్యాకేజ్ లు ఉంటాయి. అంటే దీన్ని బట్టే అర్థం అవుతుంది అక్కడ వాళ్ళు షుగర్ కొనుగోలు తక్కువగా చేస్తారు.


ఈ ట్రిక్ ఎక్కువ పాటిస్తారు


చైనీయులు తీపి తినడానికి ముందు వారికోక అలవాటు ఉంది. అదే వేడి నీటిని తాగడం. ఇది తీపి రుచిని తీవ్రం చేస్తుంది. స్వీట్స్ తినే ముందు వేడి నీరు తాగడం వల్ల కొంచెం స్వీట్ కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆధారాలతో సహా నిరూపించబడింది. 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నీరు తాగిన తర్వాత వాళ్ళతో పోలిస్తే 20 లేదా 50 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న వేడి నీటిని తాగిన తర్వాత డార్క్ చాక్లెట్ తింటే దాని తీపి విపరీతంగా ఉన్నట్టు ఒక పరిశోధనలో తేలింది. చైనీస్ వ్యక్తులు తక్కువ చక్కెర వినియోగానికి ఇది దోహద పడి ఉండవచ్చు. ఎందుకంటే అక్కడి వాళ్ళు ఎక్కువగా వేడి నీటిని తాగే అలవాటుని కలిగి ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ అలవాటు నేర్చుకుంటే సగం రోగాలు తగ్గించుకున్నట్టే.


చక్కెర తీసుకోవడం తగ్గించడంలో సహాయపడే కొన్ని చిట్కాలు


⦿భోజనంలో స్వీట్స్ ని ఒక స్నాక్ గా మాత్రమే పరిగణించాలి. భోజనం చేసిన తర్వాత కొద్ది భాగం మాత్రమే తీసుకునే అలవాటు చేసుకుంటే మంచిది.


⦿స్వీట్స్ తీసుకునే ముందు వేడి నీరు తాగాలి. ఫలితంగా తక్కువ పరిమాణంలో తీపి తీసుకుంటారు. అలా అని మరీ వేడి నీరు కాదు.


స్వీట్స్ తింటారు కానీ.. 


అలా అని చైనాలో స్వీట్లు లేవని కాదు. వివిధ రకాల స్వీట్స్ లో టాంఘులు, రాక్ షుగర్ కోటెడ్ ఫ్రూట్స్, హాత్రోన్, బాంబూ స్కేవార, ఉస్మంతస్ ఫ్లవర్ కేక్, ఉస్మంతస్ తేనె, రాక్ షుగర్‌తో చేసిన చైనీస్ పేస్ట్రీ అందుబాటులో ఉంటాయి. ఆటమ్ ఫెస్టివల్ వచ్చిందంటే చైనీస్ సంప్రదాయకమైన స్వీట్ మూన్ కేక ఎక్కువగా తింటారు. లాంతర్ ఫెస్టివల్ సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ తయారు చేస్తారు. యాంగ్జీ నది దిగువ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఎక్కువగా చక్కెర ప్రేమికులు ఉంటారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: నెయిల్ ఎక్స్ టెన్షన్ గోళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?