ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరమైనదని తేలనప్పటికీ అప్రమత్తంగా ఉండడం మాత్రం అత్యవసరం. ఈ వేరియంట్ పై ఏ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయనే అంశాల్లో కూడా పరిశోధనలు సాగుతున్నాయి. కాగా ఇతర టీకాలతో పోలిస్తే కోవాక్సిన్ ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఐసీఎమ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధికారులు చెబుతున్నారు. కోవాక్సిన్ అనేది వైరియన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని, ఇది మొత్తం కరోనా వేరియంట్లను తట్టుకోగలదని, అలాగే అధిక పరివర్తన చెందిన ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ కు వ్యతిరేకంగా పనిచేయగలదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కోవాక్సిన్ వేయించుకున్న వారికి ఇది శుభవార్తే. 


కోవాక్సిన్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై కూడా ప్రభావవంతంగా పనిచేసినట్టు గతంలోనే కనుగొన్నారు. కాబట్టి ఈ కొత్త వేరియంట్ పై కూడా కచ్చితంగా కోవాక్సిన్ పనిచేస్తుందని ఆశిస్తున్నట్టు ఒక రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. ‘నమూనాలను సేకరించాక, పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరిక్షిస్తాం’ అని చెప్పారు. తొలిసారి వూహాన్లో కనుగొన్న వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకాలన్నింటినీ అభివృద్ధి చేయడం జరిగింది.  ఆ తరువాత పుట్టుకొచ్చిన వేరియంట్లపై కూడా టీకాలు పనిచేస్తున్నట్టు పలు పరిశోధనలు నిరూపించాయి. 


మ్యుటేషన్లు ఎక్కువ...
ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ   ఒమిక్రాన్ వేరియంట్‌లో స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో 30కి పైగా మ్యుటేషన్లు కలుగుతున్నాయని, ఇది రోగనిరోధక వ్యవస్థ మెకానిజంను తప్పించుకోగల సామర్థ్యాన్ని ఇస్తుందని తెలిపారు. కాబట్టి ఈ వేరియంట్ పై టీకాల సామర్థ్యాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలని హెచ్చరించారు. స్పైక్ ప్రోటీన్ వల్ల వైరస్ మానవ కణంలో ప్రవేశించేందుకు సహాయపడుతుందని, మిగతా కణాలకు వ్యాప్తి చెందేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. 


‘చాలా వ్యాక్సిన్లు స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఏర్పరుస్తాయి. కాబట్టి స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో అనేక మ్యుటేషన్లు ఏర్పడడం వల్ల టీకా సామర్థ్యంలో తగ్గుదల కనిపించవచ్చు’అని కూడా ఆయన తెలిపారు. అందుకే ఈ విషయంలో కచ్చితమైన పరిశోధనలు అవసరమని చెప్పారు. 


Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


Also Read:  Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి