ఒకప్పుడు క్రికెట్ మధ్యలో విదేశీయులు ముద్దు పెట్టుకుంటుంటే వింతగా చూశాం. ఛీ, ఆట మధ్యలో ఇవేం పాడు పనులు అనుకొనేవాళ్లం. అయితే, మన దేశం మారిపోయింది. ఇన్నాళ్లూ విదేశాలకే పరిమితమైన బహిరంగ ముద్దులు ఇప్పుడు ఇండియాలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. ఇందుకు ఈ ఫొటోనే నిదర్శనం.
గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో అంతా కేరింతలు కొడుతూ బిజీగా ఉంటే.. ఓ జంట మాత్రం ముద్దులాటలో లోకాన్ని మరిచిపోయారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న 5వ ఓవర్‌లో ఈ జంట ముద్దుపెట్టుకోవడం కెమేరాకు చిక్కింది. అది లైవ్‌లో కూడా టెలికాస్ట్ అయ్యింది. అంతే, క్షణాల్లో ఆ ఫొటో వైరల్‌గా మారింది. చాలామంది ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆ జంటను ట్రోల్ చేస్తున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ ట్వీట్లలో చూడండి.
Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?
Also Read: మాంసాహారం, ప్రోటీన్ షేక్స్ బాగా లాగిస్తున్నారా? పురుషులూ, ఇక పడక గదిని మరిచిపోండి!