కార్తీకదీపం (Karthika Deepam ) ఏప్రిల్ 5 మంగళవారం ఎపిసోడ్


సవ్న-ఆనందరావు
ఆనందరావు, సౌందర్య ఇంటికి వచ్చిన స్వప్న, హిమ, సౌందర్య లను నానా మాటలు అంటుంది. లేని బంధాలు, బంధుత్వాలు కలుపుకోవద్దని మీ ఆవిడకి చెప్పండి అంటుంది. మీ ఆవిడ అంటున్నావ్ ఆమె నీకు తల్లి కాదా అని ఆనందరావు అంటే....నాకు తండ్రి మాత్రమే ఉన్నాడంటుంది స్వప్న. నీ మనవరాలిని నా కొడుకుల్లో ఒకరికి ఇచ్చి కట్టబెడదామని అనుకుంటున్నారా అది జరగని పని అని చెబుతుంది. శరీరానికి చేసిన గాయం మానుతుంది కానీ మనసుకి చేసిన గాయం ఎప్పటికీ మానదు...నాకు ఎప్పటికీ తల్లి కాదంటుంది. నన్ను క్షణించు స్నప్న అని సౌందర్య కాళ్లు పట్టుకునేందుకు కూడా సిద్ధపడుతుంటే...ఆనందరావు ఆపేస్తాడు. ఈ నాటకాలకు నేను లొంగనని చెప్పండి ...కళ్లముందు జరిగిన అవమానం కాళ్లు పట్టుకుంటే మరిచిపోతానా అనేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది.  


జ్వాల-సత్యం
అటు జ్వాల(శౌర్య) చేసిన వంటలు బావున్నాయని అంటాడు సౌందర్య అల్లుడు. వంటలు బావున్నాయి కానీ కొందరి తీరు అస్సలు బాలేదు సార్ అంటుంది. గుడిలో మేడంని కలిశాను అంత రఫ్ గా మాట్లాడుతున్నారు సార్, మీరేమో సాఫ్ట్ ఆవిడేమో ఫాస్ట్ , నన్ను కొట్టింది సార్ ఇంకెవరైనా అయితే నా సంగతేంటో చూపించేదాన్ని, మీ వైఫ్ అని భరించానంటుంది. నేను కూడా గట్టిగానే మాట్లాడాను సార్ ఆ విషయంలో సారీ చెబుతున్నా అని జ్వాల అంటే... గుడి దగ్గర స్వప్న ప్రవర్తనకు నేను సారీ చెబుతున్నా అంటాడు. మీరు సారీ చెప్పడం ఏంటని అంటూ... సత్యం సార్ ఓపికకి ఆ మహాతల్లి దొరికిందేంటి ఏంటో దేవుడు ఇలా చేశాడని బాధపడుతుంది జ్వాల. 


Also Read: నడిరేయిలో నీవు నిదురైన రానీవు- అర్థరాత్రి ముసుగేసుకుని మరీ రిషిసార్ తో వసుధార చాటింగ్


హిమ-నిరుపమ్
బయటకు అమాయకంగా కనిపిస్తావ్ కానీ లోపల చాలా ప్లాన్స్ ఉన్నాయ్ కదా అన్న స్వప్న మాటలకు గుర్తుచేసుకుని హిమ ఏడుస్తుంటుంది. అక్కడకు వెళ్లిన ఆనందరావు, సౌందర్య హిమని ఓదార్చుతారు. మరోవైపు అదే సమయానికి అక్కడకు వచ్చిన నిరుపమ్...తన తల్లి స్వప్న అన్న మాటలకు సారీ చెబుతాడు. ఇన్నేళ్లుగా పడుతున్న బాధనుంచి కొంచెం కొంచెం బయటపడుతుండగా ఎరో ఒకరు వచ్చి గుచ్చుతున్నారు. నేను మారాలి అనుకున్నా మారనీయడం లేదంటుంది. స్పందించిన నిరుపమ్ నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే ఆలోచించాలి, నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి ఇలాగే ముందుకెళ్లాలి అంటాడు( హిమలో మార్పుకి జ్వాలతో స్నేహం కూడా కారణం అయిఉంటుంది). ఓ తప్పు జరిగిందని బాధపడేకన్నా అందులోంచి ఎలా బయటపడాలో ఆలోచించడం కూడా గొప్ప విషయం అని చెప్పేసి నిరుపమ్ వెళ్లిపోతాడు. నిరుపమ్ హిమ మనసుని చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు...వీడు జీవితాంతం హిమకి తోడుంటే బాగా చూసుకుంటాడు. ఈ విషయం గురించి కాస్త గట్టిగా ఆలోచించాలి అనుకుంటుంది సౌందర్య.


జ్వాల
బస్తీలో ఇంటికి వెళ్లిన జ్వాల... ఇంట్లోకి ఎవరొస్తున్నారు, ఎవరు దీపాలు వెలిగిస్తున్నారని ఆలోచనలో పడుతుంది. ఆ అవసరం ఒక్క హిమకే ఉంది ఆ రాక్షసి ఇక్కడే ఉందా, ఇక్కడకు వచ్చి వెళుతోందా అనుకుంటుంది. ఇంట్లోంచి బయటకు వచ్చిన జ్వాల.... ఓ మూల నక్కిఉన్న ముసలమ్మని అడుగుతుంది. ఇంట్లో దయ్యాలు ఉన్నాయేమో అని భయం వేస్తోందని అంటుంది. అలా వచ్చి ఇలా వెళితే దయ్యాలు అంటావేంటి...ఈసారి తను వచ్చినప్పుడు తన వివరాలు తెలుసుకో, ఫోన్ నంబర్ తీసుకో అని చెబుతుంది. ఇలాంటివి చేయకుండా దయ్యాలు, భూతాలు అని పుకార్లు పుట్టించకు అంటుంది. అదే సమయంలో ఆనంద్ ని తలుచుకుంటుంది జ్వాల(శౌర్య). ఆనంద్ ని మోనిత ఆంటీ ఎక్కడకు తీసుకెళ్లినట్టు, ఆనంద్ ఎక్కడున్నట్టు అని ఆలోచిస్తుంది జ్వాల.


Also Read:  డాక్టర్ సాబ్-రౌడీ బేబి, ఫొటో గ్రాఫర్-డాక్టరమ్మ, జోరందుకుంటున్న ప్రేమకథలు


ఆనంద్ ( మోనిత కొడుకు ఎంట్రీ ఇచ్చాడు). 
అమ్మా-నాన్న మీ పేరేంటో నాకు తెలియదు. అమ్మ డైరీలో నా కార్తీక్ అని రాసిఉంది....బహుశా నాన్న పేరు కార్తీక్ ఏమో అనుకుంటాడు. ఇవాళ ఏం కూర చేశావ్ పెద్దమ్మా అంటే మటన్, చికెన్ తీసుకురావడానికి నువ్వేం మహారాజు జాతకం కాదు...దరిద్రుడివి అంటుంది. ఏంటి పెద్దమ్మా ఎప్పుడూ తిడుతుంటావ్ అనడంతో..పెద్దమ్మ మా అమ్మ పేరేంటి, మా నాన్న పేరేంటి చెప్పు పెద్దమ్మ అంటాడు. మీ అమ్మా-నాన్నలు డాక్టర్లు అని మాత్రమే నాకు తెలుసు అంటుంది. అందుకే నాకు డాక్టర్ అవ్వాలని అనిపిస్తోంది అన్న ఆనంద్... నాకు అక్కా, చెల్లి ఎవరో ఒకరు ఉంటారు కదా చెప్పు అంటాడు. నాకు ఆ వివరాలు తెలియదు...మీ అమ్మ నా చెల్లి అరుణకి ఆస్తులు అప్పగించి నిన్ను పెంచమని చెప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ ఆస్తి కోసమే నా చెల్లి అరుణ, భర్తని బంధువులు చంపేశారు...ఆమె చనిపోతూ చివరి నిముషంలో నిన్ను అంటగట్టి పోయిందంటూ ఫైర్ అవుతుంది. అమ్మా-నాన్న మీరిద్దరూ డాక్టర్లా..మీ పేర్లేంటి అని ఆలోచిస్తాడు.


ఆటోలో ఎక్కిన ఓమనిషి అడ్రస్ చెప్పడంతో ఆ ఇంటికి తీసుకెళుతుంది. ఏంటి పెద్దమ్మా ఇంత లగేజ్ అంటే..ఓ ఇంట్లో పనికి కుదిరాను సరుకులు తీసుకెళుతున్నా అని చెబుతుంది. ఈ వయసులో ఏందుకు ఇంత కష్టం పెద్దమ్మా అని జ్వాల అంటే... చిన్నప్పుడే నా మనవడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు నేను పోయేలోగా వాడిని చూస్తే చాలని ఎదురుచూస్తున్నా అంటుంది. ఇట్లోంచి వెళ్లిపోతే ఇంతలా బాధపడతారా అని ఆలోచించిన జ్వాల...అయినా వాళ్లెవరకూ నా కోసం వెతకలేదు కదా అనుకుంటుంది... 


రేపటి( బుధవారం) ఎపిసోడ్ లో
జ్వాల చీరకట్టుకుని ఆటోలోంచి దిగుతుంది...అంతా అలా రెప్పయకుండా చూస్తుండిపోతారు.