శిశువు కడుపులో ఉన్నంత వరకు ఒక రకంగా, బయటకి వచ్చిన తర్వాత వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చాలా త్వరగా రోగాల బారిన పడే అవకాశం ఉంది. తల్లి పాలే వాళ్ళకి రక్షణగా నిలుస్తాయి. శిశువు ఎదుగుదలకు తొలి సంవత్సరం చాలా కీలకంగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు వారి ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే శిశువులు చాలా సున్నితంగా ఉంటారు. రోగలతో ప్రవదేనట శక్తి వాళ్ళకి ఇంకా రాదు కనుక వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. శిశువు తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే వాళ్ళకి వచ్చే అనారోగ్య సమస్యల మీద కొంతవరకైనా అవగాహన ఉండాలి. శిశువులను తరచుగా వేదించే సాధారణ అనారోగ్యాలు ఇవే. 


జలుబు


పాలిచ్చే తల్లి తీసుకునే ఆహార పదార్థాల మీద శిశువు ఆరోగ్యం చాలా వరకు ఆధారపడి ఉంటుంది. జలుబు చేసే పదార్థాలు తినడం వల్ల తల్లి పాలు తాగే బిడ్డ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. సంవత్సరంలో ఎక్కువ సార్లు పిల్లలు జలుబు బారిన పడే అవకాశాలు ఉంటాయి. క్రమం తప్పకుండా శిశువుని పరిశీలిస్తూ, మందులు వాడుతూ ఉండాలి.


రోసోలా


ఇది హ్యూమన్ హెర్పిస్వైరస్ రకం 6(HHV-6) వల్ల వస్తుంది. దీని వల్ల దద్దుర్లు, స్వల్ప జ్వరం వస్తుంది. లాలాజలం ద్వారా ఇది వ్యాపిస్తుంది. పిల్లలు నోట్లో బొమ్మలు పెట్టుకోవడం, వాటిని చీకడం వంటివి చేస్తూ ఉంటారు. దానిలో ఉండే క్రిములు వల్ల ఇది వస్తుంది. శిశువుకి రోసోలా సోకినట్లయితే శరీరం చల్లగా హైడ్రేట్ గా ఉంటుంది. జ్వరం తగ్గేందుకు ఇచ్చే మందులు దీనికి ఉపయోగించాలి.


కడుపు నొప్పి


దీన్నే గ్యాస్ట్రో ఎంటెరిటీస్ అని కూడా అంటారు. ఇది తరచుగా పిల్లల్లో వాంతులు, విరోచనాలకి దారి తీస్తుంది. కడుపులో నొప్పి కూడా వస్తుంది. కలుషితమైన ఆహారం వల్ల ఇది సంభవిస్తుంది. అందుకే పిల్లలకి పెట్టె ఆహరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


చెవి, కంటి ఇన్ఫెక్షన్స్


చెవిలో ఇన్ఫెక్షన్ నొప్పిని కలిగిస్తుంది. తమ బాధను నోటితో చెప్పలేని పసి పిల్లలు వాళ్ళు దాని వల్ల విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. నిద్ర సరిగా పోకుండా ఉండటం, చెవి నుంచి చీము వంటివి కారడం జరుగుతుంది. కండ్ల కలక అనేది కూడ శిశువులని ఇబ్బంది పెట్టె మరొక వ్యాధి. కంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇది వస్తుంది కన్ను కూడా బాగా వాస్తుంది.


ఇవే కాకుండా బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల మలేరియా, న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా, క్షయ వంటి సమస్యలు కూడా పసిపిల్లల్ని ఇబ్బంది పెడతాయి. ఇవి ఆరోగ్య పరిస్థితిని మరింత హాని కలిగిస్తాయి. అందుకే పసి పిల్లల్ని గాజు బొమ్మలతో పోలుస్తారు. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ బాధని నోరు తెరిచి చెప్పలేరు తల్లిదండ్రులే నిరంతరం వాళ్ళని పరిశీలించుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవాలి.


Also Read: పచ్చి అల్లం VS సొంటి పొడి, ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ప్రయోజనాలేమిటీ?


Also read: ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకుంటున్నారా? అవి ప్రాణాంతక వ్యాధులకు సంకేతం కావచ్చు