ళ్లు ఎర్రగా మారడం అనేది చాలా సార్లు సాధారణ విషయమే కావచ్చు. నిద్ర సరిపడినంత లేకపోయినా, ఎక్కువగా అలసి పోయినా కళ్లు ఎర్రబారుతాయి. ఇలాంటి సందర్భాలలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ కళ్లు ఎర్రబారడంతో పాటు దురదగా ఉండడం, మంటగా ఉండడం, లేదా కంటి నుంచి డిశ్చార్జ్ ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాలనేది డాక్టర్‌ను సంప్రదించాలి.


ఇలా కళ్లు ఎర్రబడి ఇరిటేషన్ రావడానికి ముఖ్యమైన కారణం.. కంటి కలక లేదా కంజెంటివైటిస్. ఇది త్వరగా ఇతరులకు వ్యాపించే కంటి ఇన్ఫెక్షన్ అని అందరికి తెలిసిన విషయమే. దీనికి నాలుగైదు రోజుల చికిత్స, ఐసోలేషన్ అవసరం అవుతుంది. ఇది కాకుండా మరి కొన్ని సిరియస్ కారణాల వల్ల కూడా కళ్లు ఎర్రబారవచ్చని అంటున్నారు.



  • కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కళ్లు వాపుతోపాటు ఎర్రగా మారుతాయి. ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల అయితే కళ్ల నుంచి నీళ్లు కారుతాయి.

  • కోవిడ్ ఒక్కోసారి లంగ్స్, హార్ట్ కి మాత్రమే కాకుండా కంటిలో కూడా లక్షణాలను కనబరుస్తుంది. అలాంటి సమయంలో కూడా కళ్లు ఎర్రబారుతాయి. కోవిడ్ కంటి ద్వారా శరీరంలో ప్రవేశించి కంటి వెనుకగా మెదడులోకి కూడా చేరే ప్రమాదం ఉంటుందనేది నిపుణుల హెచ్చరిక.

  • కంటి పాపకు సోకే అతి సాధారణ ఇన్పెక్షన్లలో ఒకటి బ్లెఫరిటిస్. ఇదొక బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్. దీని వల్ల కూడా కళ్లు ఎర్రబారుతాయి. సాధారణంగా ఇది ఎక్స్పైర్ అయిపోయిన లేదా శుభ్రంగా లేని కంటికి వాడే బ్యూటీ ప్రాడక్స్ట్ వల్ల కలుగుతుంది.

  • కొంత మందికి కొన్ని రకాల అలర్జీలు ఇబ్బంది పెడుతుంటాయి ఉదాహరణకు పువ్వుల పుప్పొడి వల్ల కొంతమందిలో కంటిలో దురద , ఇరిటేషన్ కలిగి కళ్లు ఎర్రబారుతాయి.

  • కంటిలో వాడే కాంటాక్ట్ లెన్సులు సరిగ్గా శుభ్రం చేసుకోక పోయినా కంటిలో ఇన్ఫెక్షన్ చేరి కంటిని ఇబ్బంది పెట్టవచ్చు. రాత్రంతా పెట్టుకోవడం, స్నానం చేస్తున్నపుడు వాటిని తీసెయ్యకపోవడం వంటి నిర్లక్ష్యాలు అకాంతమీబా కెరటైటిస్ అనే ఇన్ఫెక్షన్ కు కారణం అవుతున్నాయని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి.


కళ్లు చాలా సున్నితమైన జ్ఞానేంద్రియాలు. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలర్జీలు బాధించేవారు, కాంటాక్ట్ లెన్సులు వాడేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం. అవసరం లేకుండా చేతులు కంటికి దగ్గరగా తీసుకోకపోవడం, కళ్లు నలుపుకోవడం వంటి పనులు చెయ్యకూడదు. ముఖం లాగే కళ్లను కూడా శుభ్రమైన నీటితో తరచుగా శుభ్రం చేసుకోవడం అవసరం. కంటి రెప్పలు అతుకుంటున్నా. మంటగా అనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ సమస్యల నుంచి గట్టెక్కినట్టే


Also read: ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు