ఉదయాన్నే వేడి వేడి కాఫీ తాగితే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. గతంలో టీ ఎక్కువ ఇష్టపడేవారు. ప్రస్తుతం ఎక్కువ మంది టీ కంటే కాఫీనే ఇష్టపడతారు. మితంగా కాఫీ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల కాఫీలు తాగడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, అకాల మరణం నుంచి రక్షిస్తుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇంస్టెంట్, డీకాఫీన్ లేదా మైల్డ్ కాఫీని ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని మెల్ బోర్న్ కి చెందిన నిపుణులు వెల్లడించారు. ఈ మూడు రకాల కాఫీలకి కరొనరీ హార్ట్ డిసీజ్, కాజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ వచ్చే ప్రమాదాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అయితే కెఫీన్ తో కూడిన గ్రౌండ్, ఇంస్టెంట్ కాఫీ మాత్రమే అరిథ్మియా అని పిలువబడే క్రమరహిత హృదయ స్పందన ప్రమాదాన్ని తగ్గించింది. మరొక అధ్యయనం ప్రకారం డికాఫిన్ తో చేసే కాఫీ వల్ల ఆ ప్రమాదాన్ని తగ్గించలేరని తెలిపింది.


గతంలో వచ్చిన అధ్యయనాల ప్రకారం రోజుకు 3-5 కప్పుల బ్లాక్ కాఫీని తాగడం వల్ల గుండె జల్లును, అల్జీమర్స్, పార్కిన్సన్స్, టైప్ 2 డయాబెటిస్, కాలేయ వ్యాధి, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని వెల్లడైంది. అయితే మరి కొంతమంది మాత్రం కాఫీ హృదయ సంబంధ వ్యాధులను నియంత్రిస్తుందనే దానికి మరికొన్ని ట్రయల్స్ చెయ్యడం అవసరం అని భావించారు.


గ్రౌండ్, కెఫీన్ కాఫీ వల్ల ప్రయోజనాలు 
ఈ అధ్యయనంలో బ్రిటన్ కి చెందిన హృదయ సంబంధ వ్యాధులు లేని 4.5 లక్షల మందిని పరిశీలించారు. వారిని నాలుగు గ్రూపులుగా విభజించారు. కెఫిన్ కలిపిన గ్రౌండ్ కాఫీని ఆస్వాదించేవారు, డీకాఫిన్ లేని కాఫీని ఎంచుకున్న వారు, కెఫిన్ లేని ఇన్‌స్టంట్ కాఫీని ఇష్టపడేవారు, అసలు కాఫీ తాగని వాళ్ళు ఇందులో పాల్గొన్నారు. సగటున 12.5 సంవత్సరాల తర్వాత అరిథ్మియా, హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ వంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది పరిశీలించారు. వయస్సు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, స్లీప్ అప్నియా, సెక్స్, స్మోకింగ్ స్టేటస్, టీ, ఆల్కహాల్ తీసుకోవడం వంటి వాటిని పరిగణలోకి తీసుకున్నారు. వారిని పరిశీలించిన తర్వాత అన్నీ రకాల కాఫీలు ఏ కారణంతోనైనా మరణం వచ్చే ప్రమాదం తగ్గుదలతో ముడిపడి ఉందని కనుగొన్నారు.


కెఫీన్ లేని కాఫీ తాగడం వల్ల హృదయ సంబంధ వ్యాధులని నియంత్రించవచ్చని అధ్యయనాన్ని పరిశీలించిన ప్రొఫెసర్ ఒకరు చెప్పుకొచ్చారు. కాఫీ తాగని వారితో పోలిస్తే.. రోజుకి రెండు మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల ఆకాల మరణం సంభవించే అతిపెద్ద ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. గ్రౌండ్ కాఫీ వినియోగం మరణ ప్రమాదాన్ని 27 శాతం తగ్గించగా, కెఫీన్ లేని కాఫీ తాగే వారిలో 14 శాతం, ఇంస్టెంట్ కాఫీ తాగేవారిలో 11 శాతంగా ఉంది. రోజుకి రెండు నుంచి మూడు కప్పుల కాఫీని తాగితే గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం 20 శాతం, డికాఫిన్ లేని కాఫీ తాగితే 6 శాతం, ఇంస్టెంట్ కాఫీ తాగితే 9% ప్రమాదం తగ్గినట్టు గుర్తించారు.


వీరికి ప్రమాదమే..


ఈ అధ్యయనం 12.5 సంవత్సరాల పాటు సాగింది. అయితే కాఫీ కొంతమందిలో దుష్ప్రభావాలను చూపించింది. నిద్రలేమి, మధుమేహం అదుపులో లేని వాళ్ళు కాఫీకి దూరంగా ఉండటమే మంచిది. కాళ్ళు కెఫీన్ ఉన్న కాఫీ తాగే ముందు వైద్యులని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ తయారు చేసే విధానం కూడా ఆరోగ్య ప్రయోజనాలు అందించే దాని మీద ప్రభావం చూపిస్తుంది. కాఫీలోని జిడ్డుగల భాగంలో ఉండే కెఫెస్టోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. చివరగా కాఫీని మితంగా మాత్రమే తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి ముఖ్యంగా కాఫీ పిల్లలకు అసలు మంచిది కాదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.



Also read: యాభై శాతం భారతీయ ఉద్యోగులు ఇందుకే రాజీనామా చేస్తున్నారు, సర్వేలో షాకింగ్ విషయాలు


Also read: ఈ ఎర్రని పండ్ల రసం సహజంగా నిద్రలేమిని అంతం చేస్తుంది, మందులు అవసరమే ఉండదు