ColdPlay Concert Viral Video of CEO and HR : "కెమెరా ఉంది.. వైరల్ అయిపోతాము" అని ఓ సినిమాలో నవీన్ పోలీశెట్టి అనుష్క శెట్టితో చెప్తాడు. రూమ్‌లోని సీసీ కెమెరా గురించే అంత ఆలోచిస్తే.. ఓ జంట కాన్సెర్ట్‌కి వెళ్లి అడ్డంగా కెమెరా కంటికి చిక్కింది. కోల్డ్‌ప్లే కాన్సెర్ట్ బోస్టన్‌లో జరుగుతుండగా అక్కడికి వెళ్లిన ఆస్ట్రోనోమర్ సీఈఓ (Astronomer CEO) ఆండీ బైరాన్, HR హెడ్ క్రిస్టిన్ కాబోట్ ఒకరినొకరు హత్తుకుని ఎంజాయ్ చేస్తుండగా.. స్క్రీన్‌పై వారు ప్రత్యక్షమయ్యారు. అంతే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆండీ బైరాన్, క్రిస్టిన్ కాబోట్ వీడియో ఎందుకంత వైరల్ అయ్యిందంటే.. సాధారణంగా Coldplay కాన్సెర్ట్‌లో “Kiss Cam” అనే సెగ్మెంట్ ఉంటుంది. ఆ సమయంలో కెమెరా ఫోకస్ అవుతుంది. అలా వారిద్దరివైపు కెమెరా ఫోకస్ అయింది. వారి ఇద్దరికీ పెళ్లి కూడా అయింది. అయితే వేర్వేరుగా పెళ్లి కావడంతో ఆఫీస్ ఎఫైర్స్, కిస్కామ్ పేరుతో ఈ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇది కోల్డ్‌ప్లే కాన్సర్ట్ కాదు కోల్డ్ ప్లే అంటూ వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు.
క్రిస్ మార్టిన్ స్పందన ఇదే..
ఆ వీడియోలో కెమెరా వారిపై ఫోకస్ అయినప్పుడు కోల్డ్‌ప్లే క్రిస్ మార్టిన్ జంటను చూసి "Oh look at these two" అనగానే వారిద్దరూ షాక్ అయ్యారు. ఆండీ బైరాన్ ముఖం దాచుకుంటూ కింద దాచుకోగా.. క్రిస్టిన్ ముఖాన్ని చేతులతో కవర్ చేసుకుని వెనక్కి తిరిగిపోయింది. ఈ రియాక్షన్ చూసి క్రిస్ మార్టిన్ "Alright Common You okay? Oh What.. Either they having an affair or theyre just ver shy" అంటూ Awkward రియాక్షన్ ఇచ్చాడు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది.
"Coldplay కాదు... Caughtplay కాన్సెర్ట్!", "Kiss Cam turned into Expose Cam!", "Everyone is a lover somewhere" అనే క్యాప్షన్లు ఇస్తూ.. నెటిజన్లు దీనిని షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రోనోమర్ సీఈఓ ఆండీ బైరాన్ భార్య మేగాన్ కెర్రిగన్ ఆమె ఫేస్ బుక్ ప్రొఫైల్ నుంచి బైరాన్ అనే పదాన్ని తొలగించింది. కానీ దీనిగురించి ఎవరూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ మధ్యకాలంలో ఆఫీస్ ఎఫైర్స్ అనే కల్చర్ బాగా ఎక్కువ అవుతుంది. ఇలాంటి ఘటనలతో ఆఫీస్‌లలో, పర్సనల్ లైఫ్, ప్రొషెనల్ బౌండరీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశముంది. పెళ్లైనవారు, పెళ్లి కానీ వారు కూడా వర్క్ చేసుకుంటూ తమ అఫైర్స్ కొనసాగిస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగతమే అయినా.. రానున్న రోజుల్లో ఇది పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా డిస్టర్బ్ చేస్తుందని కచ్చితంగా గుర్తించుకోవాలి.
ఇదీ చదవండి : ఆఫీస్‌లో పెరుగుతోన్న రొమాన్స్ కల్చర్.. పెళ్లైన వారు కూడా సహోద్యోగులతో ఎఫైర్స్, షాకింగ్ రిజల్ట్స్