Shani Vakri 2025: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా, మకరం- కుంభ రాశుల అధిపతిగా చెబుతారు పండితులు. శని గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా, దాని ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. మిగిలిన గ్రహాల కన్నా శని నెమ్మదిగా సంచరిస్తాడు. అందుకే మందరుడు అని పిలుస్తారు..రెండున్నర సంవత్సరాలకు ఓసారి రాశి మారుతాడు శని భగవానుడు. ఈ సమయంలో 12 రాశులపై ప్రభావం ఉంటుంది...కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలనిస్తే..మరికొన్ని రాశులపై అనుకూల ఫలితాలనిస్తాయి. 2025 జూలై 13 నుంచి శని వక్రదిశలో సంచరిస్తున్నాడు.
శని తిరోగమనం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?
శని తిరోగమనం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సంబంధాలలో సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. వృత్తిపరమైన జీవితంలో అసంతృప్తి ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంటుంది. మానసిక అస్థిరత ఉంటుంది. గతంలో వెంటాడిన వ్యాధులు మళ్లీ పెరుగుతాయి. చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అంతా గందరగోళంగా అనిపిస్తుంది. శని మీన రాశిలో ఉన్నప్పుడు ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుంది.
శని వక్రీకరణ వల్ల ఏ రాశులకు మంచిది కాదు? ఈ సంవత్సరం శని 138 రోజుల పాటు వక్రీ స్థితిలో ఉంటాడు. ఈ సమయంలో మిథున రాశి, తులా రాశి, సింహ రాశి, మేష రాశివారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని తిరోగమనం అశుభత్వాన్ని ఎలా నివారించాలి?
శని వక్రీకరణ చెడు ప్రభావం ఉన్న రాశి వారు ప్రతిరోజూ పరిశుభ్రమైన దుస్తులు ధరించి..ఆలయానికి వెళ్లిరండిశని దేవాలయానికి వెళ్లి ఆవాల నూనెతో దీపం వెలిగించాలిశనివారం రోజు నల్ల నువ్వులు, నల్ల మినుములు, ఆవాల నూనె దానం చేయడం వల్ల శని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.ఆవాల నూనెతో నిండిన గిన్నెలో మీ నీడను చూసి దానిని దానం ఇవ్వండిశనిని శాంతింపచేసేందుకు నిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించాలిహనుమంతుడిని పూజించడం అత్యుత్తమ పరిష్కారంప్రతిరోజూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి..శివుడికి నీటితో అభిషేకం చేయండిపారిశుద్ధ్య కార్మికులకు సహాయం చేయండి..అన్నదానం చేయండి
నిత్యం ఈ శ్లోకాలు పఠించండి
శని గాయత్రీ మంత్రం
ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద:ప్రచోదయాత్
శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహారవర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయకృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయశుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి
శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ఏబీపీ దేశం ధృవీకరిండం లేదు. ఈ సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.