Visakhapatnam Latest News: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకానికి ప్రత్యేక స్థానం ఉంది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు రోజుల తరబడి చూసి ఎంజాయ్ చేసే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. అలాంటి అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో వైజాగ్‌లో గ్లాస్ వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఆగస్టు 15 నాటికి పర్యాటకులకు కొత్త అనుభూతిని మిగల్చేందుకు సిద్ధమవుతోంది టూరిజం డిపార్టమెంట్.
వైజాగ్ అంటే అందమైన బీచ్ మొదట గుర్తుకు వస్తుంది. తర్వాత కైలాసగిరి ఇలా ప్రతి ప్రదేశం మనల్ని మైమరిచిపోయేలా చేస్తాయి. ఇప్పుడు మరో స్పెషల్ అట్రాక్షన్ ఇందులో చేరింది. కైలాసగిరిలో ఏర్పాటు అవుతున్న గాజు వంతెన విశాఖకు మరింత హంగును తీసుకురానుంంది.
గ్లాస్ బ్రిడ్జి ఎక్కడ నిర్మిస్తున్నారు?విశాఖపట్నం వెళ్లిన వాళ్లు బీచ్, కైలాసగిరికి వెళ్లిరాకుండా వారి టూర్ కంప్లీట్ కాదు. అందుకే ఆ ఆసక్తిని మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా గ్లాస్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. కైలాసగిరి హిల్‌టాప్ అంటే టైటానిక్ వ్యూపాయింట్ సమీపంలో ఈ గాజు వంతెన నిర్మిస్తున్నారు. దీని పొడవు సుమారు 50 మీటర్లు ఉంటుంది. అంటే 167 అడుగులు అన్నమాట. పూర్తిగా పారదర్శక గాజుతో కూడిన కాంటిలివర్ టెక్నాలజీ ఆధారంగా నిర్మిస్తున్నారు.
దేశంలోనే భారీ గ్లాస్ వంతెన
ఇది పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తే దేశంలోనే అతి పెద్ద గాజు వంతెనగా రికార్డు సృష్టించబోతోంది. దీని కోసం ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీనికి మరిన్ని డ్వెంచ్‌లను జోడించేందుకు మరో రెండు కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నారు.ది పూర్తి అయితే దీనిపై నడిచి విశాఖ అందాలను చూడొచ్చు. పూర్తిగా ట్రాన్స్‌పరెంట్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. భద్రతపరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిపై ఒకసారి 40 మంది వరకు నడవచ్చు.
ఈ బ్రిడ్జిపై నడుస్తూ సముద్రతీరం, బీచ్‌లైనింగ్, హర్షవర్దన గిరి, సిటీని చూడవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ గాజు వంతెన ఏర్పాటు చేస్తున్నారు. బిల్డింగ్ కోడ్, టెన్షన్ టెస్ట్, హైటెక్ బోల్టింగ్ వంటివి అమలు చేస్తున్నారు. సాహసోపేతమైన గేమ్స్ ఇష్టపడే వాళ్లకు జిప్‌లైన్, స్కైసైక్లింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిప్ లైన్ 150 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి అనుబంధంగానే స్కైస్లైక్లింగ్ రెడీ అవుతుంది. గత ఏడాది నవంబర్‌లో పనులు మొదలు అయ్యాయి. ఈ వేసవికి అందుబాటులోకి తీసుకురావాలని చూశారు. కానీ అనుకున్నంత వేగంగా పనులు సాగలేదు. ఇప్పుడు ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసి నగర ప్రజలకు పర్యాటకులకు అందివ్వాలని చూస్తున్నారు.