ప్రొటీన్లు ఉండే ఆహారం తినడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలు, శారీరకంగా కష్టపడేవారికి ప్రొటీన్లు ముఖ్యం. గుడ్డు ప్రొటీన్లకు నిలయం, అలాగే చికెన్లో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ కలిపి ఆమ్లెట్ వేస్తే రుచి మామూలుగా ఉండదు. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
కావాల్సిన పదార్ధాలుబోన్ లెస్ చికెన్ - 100 గ్రాములుగుడ్డు - రెండుఉల్లిపాయ తరుగు - పావు కప్పుపచ్చిమిర్చి తరుగు - ఒక స్పూనునూనె - తగినంతఉప్పు - రుచికి సరిపడాకారం - అర స్పూనుపసుపు - పావు స్పూనుగరం మసాలా - పావు స్పూను
తయారీ ఇలా...1. బోన్‌లెస్ చికెన్‌ను ఆమ్లెట్ కోసం ఎంచుకోవాలి. చికెన్‌ను ముందే ఉడకబెట్టుకోవాలి. 2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, చికెన్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు మొదలగునవి వేసి వేయించాలి. 3. అవన్నీ బాగాక ఆ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. 4. ఆ గిన్నెలో రెండు గుడ్లు కొట్టి వేయాలి. బాగా కలపాలి. 5. ఆ గుడ్ల మిశ్రమంలో చికెన్ ముక్కల మిశ్రమాన్ని వేసి గిలక్కొట్టాలి. 6. పెనం వేడెక్కాక నూనె వేసి గుడ్ల మిశ్రమంలో ఆమ్లెట్‌లా వేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకోవాలి. 7. ఆమ్లెట్ల చుట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
ప్రోటీన్ లోపం రాదు...ఇలా చికెన్ ఆమ్లెట్ వారానికి రెండు సార్లు వేసుకుని తింటే మంచిది. దీని వల్ల ప్రోటీన్ లోపం తలెత్తదు. మనదేశంలో 73 శాతం మందిలో ప్రొటీన్ లోపం ఉందని సర్వేలు తేల్చాయి. శరీరం ఎదగడానికి ప్రొటీన్ చాలా అవసరం. అందుకే పిల్లలకు పెట్టమని చెబుతారు వైద్యులు. ఎంత ప్రొటీన్ తీసుకోవాలో కూడా చాలా మంది ప్రజలకు తెలియదు. మీ శరీరబరువు ఎన్ని కిలోలు ఉంటే అన్ని గ్రాముల ప్రొటీన్ అవసరం పడుతుంది. లేకుంటే ప్రొటీన్ లోపం తలెత్తుతుంది. దీని వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వీటిలో ప్రొటీన్లు అధికం...చేపలు, సముద్రపు ఆహారం, చికెన్ (స్కిన్ లెస్), తక్కువ కొవ్వు ఉండే పాలు, పెరుగు, చీజ్, గుడ్లు, బీన్స్ వంటి వాటిలో ప్రొటీన్లు అధికం. వీటిలో కనీసం రెండు రోజూ తినేందుకు ప్రయత్నించాలి.
Also read: అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఏం తింటారు? వారికి ఉప్పు, పంచదార కూడా పంపించరా?
Also read: తలనొప్పి, మైగ్రైన్‌తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు తగ్గిస్తాయి