Konaseema News : కోనసీమ జిల్లాలో పెనుప్రమాదం జరిగింది. రహదారిపై భారీ వర్షం కుప్పకూలింది. అల్లవరం మండలంలోని తుమ్మలపల్లి గ్రామం వద్ద ప్రధాన రహదారిపై భారీ వృక్షానికి 33 కేవీ విద్యుత్ వైర్ల తగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలకు మామిడి చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై  పడిపోయింది. అదే సమయంలో రహదారిపై ప్రయాణిస్తున్న ఒక కారుపై ఈ వృక్షం పడడంతో కారుపై భాగం బాగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల తలకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రహదారికి అడ్డంగా వృక్షం పడడంతో ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్తు సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. స్థానికులు చెట్టును పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 



41 మండల్లాలో పిడుగుపాటు హెచ్చరికలు


శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్ల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం జిల్లాలో ఈ మండలాల్లో పిడుగులు పడొచ్చు. 16  మండలాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం, టెక్కలి,  సారవకోట, మెలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీనరసుపేట, గంగువారి  సిగడాం మండలాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. 


విజయనగరం జిల్లా ఈ మండలాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది. 15 మండలాలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల,గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, రామభద్రాపురం, దత్తిరాజేరు, సంతకవిటి, రాజాం, మెరకముడిదం, బొబ్బిలి, వంగర, తెర్లాం, రేగడి ఆమదాలవలస మండలాలకు హెచ్చరిచలు జారీ అయ్యాయి. 


అనకాపల్లి జిల్లాలో 


చీడికాడ, కె.కొత్తపాడు, దేవరపల్లి


అల్లూరి  సీతారామరాజు జిల్లాలో 


డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి


పార్వతీపురంమన్యం జిల్లాలో 


 పాచిపెంట, బలిజిపేట, పాలకొండ, సీతంపేట


ఈ మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.