చిన్న పని చేసినా, కాసేపు చదివినా కొందరికి తలనొప్పి వచ్చేస్తుంది. మైగ్రేన్ తలనొప్పి దీనికి భిన్నమైనది. ఇది ఎప్పుడొస్తుందో కూడా ఊహించలేం. ఇదొక నాడీ సంబంధ స్థితి అని చెప్పుకోవచ్చు. ఇది తలకు ఓ వైపు మాత్రమే వస్తుంది. రెండు గంటల నుంచి రెండు రోజుల కన్నా ఎక్కువ సమయం బాధిస్తుంది. మైగ్రేన్ వచ్చినప్పుడు ముఖం, కాలు, చేయి వంటి ప్రాంతాల్లో జలదరింపులా అనిపిస్తుంది. వికారం, వాంతులు వంటివి కూడా వస్తాయి. మైగ్రేన్‌తో ఏళ్లుగా బాధపడుతున్నవారు ఉన్నారు. మైగ్రేన్, తలనొప్పి వంటి వాటికి యోగాలో కొన్ని ఆసనాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. మంచి ఫలితాలు కనిపించాలంటే కచ్చితంగా కొన్ని నెలల పాటూ వీటిని రోజూ వేయాల్సి వస్తుంది. ఆ ఆసనాలు ఇవే...


1. హస్తపాదాసన



ఈ ఆసనం వల్ల తలనొప్పి, మైగ్రేన్ తగ్గడంతో పాటూ ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. కండరాలను గట్టిగా పట్టేయకుండా సాగేలా చేస్తుంది. దీని వల్ల కదలిక చురుగ్గా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. వెన్నుపూస కదలికలు సులువగా మారతాయి. పొట్టలోని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. 


2. శిశుఆసన



ఈ ఆసనం శరీరం వెనుక భాగాన్ని రిలాక్స్ చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గర్భిణిలు, విరేచనాలతో బాధపడేవారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. 


3. మార్జారిఆసన


ఈ ఆసన చాలా సులువు. మీ వెన్నుపూసను చాలా ఫ్లెక్సిబుల్ గా మారుస్తుంది. భుజాలు, పిడికిలి వంటివి శక్తివంతంగా మారుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను చక్కగా పనిచేసేలా చేస్తుంది. 


4. అథోముఖస్వనాసన



ఈ ఆసనం తలనొప్పి తగ్గించడమే కాదు, కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల చుట్టూ ఉండే కండరాలను శక్తిమంతంగా మారుస్తుంది. మొత్తం శరీరాన్ని శక్తిమంతంగా మారడానికి సహకరిస్తుంది. ముఖ్యంగా భుజాలు, చేతులు, కాళ్లు, పాదాలు వంటివి. 


5. సేతు బంధాసన



శరీరం వెనుక భాగాన ఉండే కండరాలు శక్తిమంతంగా మారతాయి. వీపు, వెన్ను నొప్పి వేధిస్తుంటే సేతు బంధాసన ఆ నొప్పిని దూరం చేస్తుంది. ఒత్తిడి, యాంగ్జయిటీ వంటి మానసిక ఆందోళనలను తగ్గించి, మెదడును కూల్ చేస్తుంది. 


ఈ ఆసనాలు రోజూ చేయడం వల్ల తలనొప్పి రావడం తగ్గుతుంది. అలాగే మైగ్రేన్ ఉన్న వారిలోనూ మంచి మార్పు కనిపిస్తుంది. అన్నింటికన్నా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. 


Also read: వీటిని రోజూ తింటే మీలో జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది


Also read: డయాబెటిస్ ఉన్న వారు వేరుశెనగపలుకులతో చేసిన వంటకాలు తినవచ్చా?