సాధారణ వ్యక్తికి మేలు చేసే ఆహారాలు, డయాబెటిస్ ఉన్న వ్యక్తికి కూడా మేలే చేయాలని లేదు. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంతోమంది డయాబెటిస్ రోగులు వేరుశెనగపలుకులతో చేసిన వంటకాలు తినేందుకు ఇష్టపడరు. నిజానికి మధుమేహం ఉన్నవారు తమ ఆహార మెనూలో వేరుశెనగపలుకులను కలుపుకోవచ్చు. ఇవి ఇతర నట్స్ (బాదం, పిస్తా, వాల్ నట్స్) లాగే శరీరానికి మేలు చేస్తాయి. వాటి కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. 


జీఐ తక్కువే...
డయాబెటిక్ రోగులు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మీ శరీరంలో కార్బోహైడ్రేట్లను ఎంత త్వరగా గ్లూకోజ్ లేదా చక్కెరగా మారుస్తుందనే విషయాన్ని కొలుస్తుంది గ్లైసీమిక్ ఇండెక్స్. ఇది 100 పాయింట్లు ఉండే స్కేల్. ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచే ఆహారాలకు రేటింగ్ ఇస్తుంది. రక్తంలో చక్కెరపై ఏమాత్రం ప్రభావం చూపని నీరు జీఐ విలువ సున్నా. ఇక వేరుశెనగ పలుకుల జీఐ కేవలం 13  మాత్రమే. అంటే ఇవి తక్కువ జీఐ ఉన్న ఆహారమే. 


తింటే ఎంత మంచిదంటే...
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ కథనం ప్రకారం ఉదయాన వేరుశెనగలు లేదా పీనట్ బటర్ తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ రోజంతా అదుపులో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది.28 వేరు శెగన పలుకులలో 12 శాతం మెగ్నిషియం ఉంటుంది. ఇది ఒక మనిషికి ఒక రోజుకి కావాల్సిన మెగ్నిషియం ఇది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణంలో ఉంచేందుకు మెగ్నిషియం చాలా అవసరం. 


అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం వేరుశెనగ, లేదా పీనట్ బటర్ టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేరుశెనగలో అసంతృప్త కొవ్వులు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి, ఇవి ఇన్సులిన్‌ను నియంత్రించడంలో శరీరానికి సాయం చేస్తాయి. 


ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...
అతిగా తింటే ఏదైనా చెడే చేస్తుంది. అలాగే వేరుశెనగలు రోజుకు 20 దాటకుండా తినడం మంచిది. వీటిలో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి అధికంగా శరీరంలో చేరితే శరీరంలో ఇన్ప్లమ్మేషన్ (వాపు)కు కారణమవుతుంది. అలాగే మధుమేహం వచ్చే లక్షణాలను పెంచుతుంది. ఊబకాయం బారిన పడేలా చేస్తుంది. 


వేరుశెగనలు తిన్నప్పుడు అధికంగా ఉప్పుడు, చక్కెర వంటివి లేకుండా తినాలి. వాటితో కలిపి తినడం వల్ల సమస్యలు అధికం అవుతాయి. 


ఈ గింజల్లో కెలోరీలు అధికం. అరకప్పు తింటేనే 400 కెలోరీలు వచ్చేస్తాయి. కాబట్టి అధికంగా కాకుండా రోజులో మితంగ తినడం ఉత్తమం. లేకపోతే మధుమేహాన్ని పెంచేస్తాయి.  


Also read: తక్కువ జీఐ ఉండే ఆహార పదార్థాలు ఇవే, వీటిని తింటే డయాబెటిక్ రోగులు సేఫ్


Also read: పదిరూపాయలకే టేస్టీ బిర్యానీ, తినాలంటే ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే