Ganesh Chaturthi Decoration: వినాయక చవితి వచ్చిందంటే చాలు హడావుడి మామూలుగా ఉండదు. విగ్రహం నుంచి ప్రసాదాలు, డెకరేషన్, ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా ఉత్సాహంతో చేస్తుంటారు భక్తులు. ఊరి మొత్తం కలిసి పెట్టే విగ్రహం కోసమైనా, కాలనీలో పెట్టుకునే విగ్రహం కోసమైనా లేదా ఇంట్లో పెట్టుకునే విగ్రహం కోసమైనా ఏర్పాటు చేసే మండపంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
పూలతో ప్రత్యేక డెకరేషన్
విగ్రహం గురించి ఎంతటి శ్రద్ధ తీసుకుంటారో అంతకంటే ఎక్కువ మండపం డెకరేషన్ పై ఫోకస్ పెడుతుంటారు. విగ్రహం సైజును బట్టి పూజా కమిటీ స్థాయిని బెట్టి ఈ డెకరేషన్ ఉంటుంది. చాలా మంది డిజైనర్లను తీసుకొచ్చి వివిధ రకాలుగా మండపాలను రూపొందించడమే కాకుండా అక్కడ డెకరేషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. అయితే మీరు మాత్రం చాలా సింపుల్‌గా తక్కువ ఖర్చుతో గమపతి మండపాలను డెకరేట్ చేసుకోవచ్చు.
మీ పరిసరాల్లో లభించే పూలతోనో ఆకులతోనే మరే ఇతర ప్రకృతి సహజంగా లభించే వాటితో గణేష్ మండపాన్ని తీర్చిదిద్దవచ్చు. వీటి వల్ల పర్యావరణానికి హాని లేకపోవడమే కాకుండా చూడటానికి కూడా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని డెకరేషన్ ఫోటోలు మీకు అందిస్తాం.
Also Read: పూజకు మట్టి వినాయకుడే ఎందుకు..పురాణాల్లో దీనిగురించి ఏముంది!
చాలా స్పెషల్‌గా ఉండండి
ఈ అందమైన డెకరేషన్స్ తో మీ వినాయకుడు మీ ఏరియాలోనే చాలా స్పెషల్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ డెకరేషన్‌కు ఎక్కువగా బంతిపూలు, గులాబీలు వాడాల్సి ఉంటుంది. కాస్త ఖర్చు పెట్టే స్తోమత మీకు ఉంటే మాత్రం విదేశ పూలు కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. వాటిని కూడా మీ గణపతి అలంకరణకు వాడుకోవచ్చు. ఈసారి పర్యావరణానికి హాని కలిగించే వాటిని పక్కన పెట్టి పూలతో అలంకరించి చూడండి.... మీరు చాలా స్పెషల్ అని మీతోటి వారు అంటారు.
Also Read: మోదకాలంటే వినాయకుడికి మహా ప్రీతి.. రవ్వతో, డ్రై ఫ్రూట్స్‌తో ఇలా టేస్టీగా మోదకాలు చేసేయండి
పర్యావరణ హితంగా గణేష్ అలంకరణ
పూలు సుకుమారమైనవి అందుకే పూల అలంకరణ ఏ పండగకైనా స్పెషల్‌గానే ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పూల సువాసన జోడిస్తే వచ్చే అనుభూతి అనుభవిస్తే కాని చెప్పడానికి మాటలు సరిపోవు. ఓ వైపు భక్తిప్రపత్తులతో నిండి ఉన్న మండపానికి పూల సువాసనలు తోడైతే మనసుకు ఎంత ప్రశాంతంతో ఉంటుందో కదా.
ఈ కింది ఫోటోల్లో ఉన్న విధంగా డిజైన్లు ఒక్కసారి చూడండి. ఇందులో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఈసారికి సిద్ధం చేసి అందులో గణేష్ ప్రతిమను ప్రతిష్టించండి. పూలు సొగసులు, రంగ వల్లుల మధ్య ఉన్న గణేష్‌ను చూస్తున్నంత సేపు చూడాలనిపిస్తుంది. ఇలా చేసి చూడండి ఇప్పటి వరకు మీరు చేసిన గణపతి డెకరేషన్స్‌లోనే చాలా స్పెషల్‌గా ఉంటుంది. మర్చిపోలేనిదా మిగిలిపోతుంది.