Significance of Eco-Friendly Lord Ganesha Idols:  మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకోండి..పర్యావరణాన్ని కలుషితం చేసే విగ్రహాలకు పూజలొద్దనే ప్రచారం చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. అయితే కేవలం పర్యావరణం కోసమే కాదు..పురాణాల్లోనూ ఇది విషయం చెప్పారు.  


వినాయకుడి వైభవాన్ని చెబుతున్న సూతమహర్షిని శౌనకాది మునులు ఓ ప్రశ్న అడిగారు..


శౌనకాది మహామునులు: ఓ మహర్షీ.. వినాయక చవితి రోజు మట్టితో చేసిన ప్రతిమనే ఎందుకు పూజించాలంటారు? దానిని ఎందుకు నిమజ్జనం చేయాలి? 
సూతమహర్షి: పరమేశ్వరుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. పంచభూతాలు ఆయనలో నిక్షిప్తమైనవే. అందులో భూతత్వానికి నిదర్శనం మట్టి. అందుకే మట్టితో గణపతిని తయారు చేయమని చెప్పారు. 


Also Read: Vinayaka Chavithi Pooja Vidhi in Telugu: వినాయకచవితి పూర్తి పూజా విధానం...ఇది ఫాలో అవండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు!


మృత్తికయే పరబ్రహ్మ


మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం |
మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||


ఓ మృత్తికా! నేను చేసిన పాపాలు, దుష్కృతాలు నశింపజేయి.. నువ్వు బ్రహ్మతో సృష్టించబడ్డావు. కశ్యప ప్రజాపతి మంత్రపూతతో పవిత్రురాలివి అయ్యావు ( కశ్యపుడు పవిత్రం చేసిన మట్టినే భూమంతా చల్లాడని పురాణాల్లో ఉంది)


పార్థివ లింగార్చనే శివయ్యకు ప్రీతకరం


ఓ సారి పార్వతీదేవి శివుడిని ప్రశ్నించింది.. బంగారం, వెండి, రాగి సహా ఎన్నో లోహాలతో అర్చనలు అందుకుంటారు ..మీకు అమితమైన ఆనందాన్నిచ్చే లింగార్చన ఏదని?..అందుకు ప్రతిగా పరమేశ్వరుడు  నాకు అన్నిటికన్నా పార్థివ లింగార్చనే ఇష్టం అని బదులిచ్చాడు.  పార్ధివ లింగం అంటే మట్టితో తయారు చేసినది అని అర్థం. మట్టితో తయారు చేసిన భగవంతుడి స్వరూపానికి ఇంకే లోహమూ సాటిరాదని ఆంతర్యం. మట్టితో తయారుచేసి భగవంతుడిని అర్చిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. 


Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!


ప్రకృతి స్వరూపం మృత్తిక



  • ప్రకృతికి స్వరూపం అయిన మట్టినుంచి  సకల జీవులు ఉద్భవిస్తాయి

  • మట్టి నుంచి వచ్చే పదార్థాల ద్వారానే సకల జీవులు పోషింపబడతాయి

  • సకల జీవులు చివరకు మట్టిలోనే లయం అవుతాయి..ఇదే పరబ్రహ్మతత్వం

  • ఈ సత్యాన్ని చెప్పేందుకే  పరమశివుడు స్థూలరూపం అయిన భూమినుంచి మట్టిని తీసి విగ్రహం తయారుచేసి ప్రాణం పోశాడు (  వినాయక రూపాన్ని శివుడు మట్టితో తయారు చేశాడని లింగపురాణంలో ఉంది)

  • ముత్తికయే పరబ్రహ్మ స్వరూపం కనుక..మట్టి వినాయకుడినే పూజించాలి

  • ధనిక బీదా, రాజు పేదా అనే భేదం లేకుండా మట్టి అందరకీ దొరుకుతుంది..సర్వసమానత్వానికి ఏకైక నిదర్శనం భూమి/మట్టి.


సర్వ మానవత్వానికి ప్రతీక మట్టి వినాయకుడు..అందుకే మట్టి విగ్రహాన్నే పూజించాలని చెప్పాడు సూతమహర్షి..


lso Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!


వినాయకచవితిరోజు కేవలం మట్టి విగ్రహమే...


వినాయక చవితి రోజు కేవలం మట్టితో చేసిన గణేషుడినే పూజించాలని చెబుతోంది ముద్గల పురాణం. ఎందుకంటే ఈ తిథిరోజు ఇంట్లోకి వచ్చే గణపతిని ఆకర్షించే శక్తిని మట్టికి మాత్రమే ఉంది. భగవంతుడిని దేనిలోకి ఆవాహనం చేస్తామో అది పవిత్రంగా ఉండాలి...అంటే మట్టిని మించిన పవిత్రత దేనికుంది?...అందుకే మృత్తికా గణపతిని ఆరాధించాలి.


Also Read: వినాయకచవితి పూజకి ఎలాంటి విగ్రహం కొని తెచ్చుకోవాలి!


మట్టివిగ్రహం నీటిలో వెంటనే కరిగిపోతుంది..ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరగదు పైగా పర్యావరణానికి మరింత అనర్థం. 21 రకాల పత్రిని మట్టి ప్రతిమను నీటిలో కలవడంతో వాటిలో ఉండే  ఔషధ గుణాలు నీళ్లలోకి కలసి ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపచేస్తాయి. పైగా ఆక్సిజన్ శాతం పెరుగుతుంది...అందుకే మట్టి గణపతే మహాగణపతి అంటారు.