Ganesh Chaturthi 2024: వినాయక చవితి పండుగ రోజు భక్తులు తమ కంటికి నచ్చినది, స్తోమతకు తగ్గట్టు గణేషుడి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తారు. అయితే భగవంతుడు ఒక్కడే కానీ ఎన్నో ఆకృతులు. ప్రతి ఆకృతి వెనుకా ఓ ఆంతర్యం ఉంటుందంటారు పండితులు..


Also Read: Vinayaka Chavithi Pooja Vidhi in Telugu: వినాయకచవితి పూర్తి పూజా విధానం...ఇది ఫాలో అవండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు!
 
తొండం ఎడమ వైపు ఉంటే


గణేషుడి విగ్రహానికి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండే విగ్రహం  తీసుకొచ్చి పూజిస్తే ఈ ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుంది.


తొండం కుడివైపు ఉంటే


గణనాథుడి తొండం కుడి వైపు తిరిగి ఉండే విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజిస్తే.. కోరిన న్యాయబద్ధమైన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అయితే ఇలాంటి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజించినప్పుడు సరైన నియమ నిబంధనలు పాటించాలి..లేదంటే కొత్త ఇబ్బందులు తప్పవు..


తొండం మధ్యలో కనిపిస్తే
 
పార్వతీతనయుడి తొండం మధ్యలో ఉండే విగ్రహాలను పూజిస్తే ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పారిపోతుంది. ఇంట్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొంత ఉపశమనం పొందుతారు.


తెల్లటి వినాయకుడు


తెలుపు రంగు గణేషుడి విగ్రహాన్ని పూజించే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఉంటుంది. సాధారణంగా కుటుంబంలో కలహాలు ఉంటే తెలుపు రంగు వినాయకుడిని పూజిస్తే తగాదాలు సమసిపోతాయంటారు. 


Also Read: గణేష్ చతుర్థి రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది!
 
రావి ఆకు వినాయకుడు


రావి ఆకు రూపంలో ఉన్న గణనాథుడిని పూజిస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోయి..అంతా మంచే జరుగుతుందని చెబుతారు..


ఇంకా ఈ విగ్రహాలు తెచ్చుకుంటే


వెండితో తయారు చేసిన వినాయకుడిని పూజిస్తే పేరు ప్రఖ్యాతులు సొంతం అవుతాయి
చెక్కరూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఆరోగ్యం
కంచు వినాయకుడిని పూజిస్తే ఇంట్లో సంతోషం
మట్టి గణపతికి పూజలు చేస్తే కెరీర్లో విజయం
 
పూజలు తీసుకొచ్చే విగ్రహం ఎంత ఉండాలి...


ఇంట్లో నిత్యం చేసుకునే పూజలకు వినియోగించే విగ్రహాలు  బొటనవేలు కన్నా పెద్దగా ఉండకూడదు. అయితే వినాయక చవితి లాంటి వ్రతాలు ఆచరించినప్పుడు అరచేతి కన్నా పెద్ద విగ్రహం ఉండకూడదు. పూజకు వినియోగించే విగ్రహాలు ఎంత పెద్ద పరిమాణంలో ఉంటే అంత పెద్ద స్థాయిలో ధూప, దీప నైవేద్యాలు సాగాలి.. అందుకే పూజలకు చిన్న విగ్రహాలు వినియోగించాలని చెబుతారు. పూజలో మట్టివిగ్రహం వినియోగించడం అత్యుత్తమం... లేదంటే పంచలోహాలతో తయారుచేసిన వినాయకుడిని పూజలు చేయొచ్చు..


Also Read: వినాయక చవితి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
 
గణేషుడి రూపాలు


లంబోదరుడికి 32 రూపాలు ఉన్నాయి. వీటిలో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవని చెబుతారు. 
1. బాలగణపతి 2. తరుణ గణపతి 3. భక్త గణపతి 4. వీర గణపతి 
5. శక్తిగణపతి 6. ద్విజ గణపతి 7. సిద్ధి గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి
 9. విష్ణు గణపతి 10.క్షిప్త గణపతి, 11. హేరంభ గణపతి 12. లక్ష్మీగణపతి
13. మహాగణపతి 14. విజయ గణపతి 15. రుత్య గణపతి 16. ఊర్ధ్వ గణపతి


Also Read: వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు - చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలి!