Cardiac Arrest amnd Heart Attack Causes : గుండె సమస్యలంటే చాలామంది అనుకునేది హార్ట్ఎటాకే. కానీ గుండె జబ్బుల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు కూడా ఉన్నాయి. అయితే చాలామంది కార్డియాక్ అరెస్ట్​నే గుండెపోటు అనుకుంటారు. కానీ ఈ రెండు ఒకటి కాదు. ఈ రెండు గుండెకు సంబంధించిన సమస్యలే అయినా.. వీటిలో చాలా తేడాలు ఉంటాయి. అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? హార్ట్ ఎటాక్​కి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కార్డియాక్ అరెస్ట్


గుండె సడెన్​గా కొట్టుకోవడం ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. శరీరంలోని ఎలక్ట్రికల్ మాల్​ఫంక్షన్​ వల్ల ఇది వస్తుంది. ఎలాంటి ప్రమాద సంకేతాలు లేకుండా సడెన్​గా వస్తుంది. కార్డియాక్ అరెస్ట్​ గురైన వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోతారు. శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. ఈ సమస్యను అత్యంత తీవ్రమైన ఎమర్జెన్సీగా కన్సిడర్ చేస్తారు. వెంటనే సీపీఆర్ చేస్తే మంచిది. 


హార్ట్ ఎటాక్.. 


హార్ట్ ఎటాక్ అంటే గుండె కండరాలకు రక్తప్రసరణ ఆగిపోతుంది. బ్లాకేజ్ వల్ల ఇలా జరుగుతుంది. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని ప్రమాద హెచ్చరికలను శరీరం అందిస్తుంది. నొప్పి వల్ల స్పృహ తప్పిపోతారు. బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెడికల్ ఎమర్జెన్సీ అందించడం చాలా అవసరం. 


హార్ట్ ఎటాక్​కు కారణాలు


ఆర్టెరీలలో రక్తప్రసరణ జరగకుండా అడ్డుపడడం. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు ఇలా జరుగుతుంది. బీపీ ఎక్కువగా ఉన్నవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్, ఒబెసిటి, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండేవారికి, స్మోకింగ్ చేసేవారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. 


కార్డియాక్ అరెస్ట్​కు కారణాలు


హార్ట్ రిథమ్​లో మార్పులు, హార్ట్ ఎటాక్​ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్చొచ్చు. మానసిక సమస్యలు, రక్తం ఎక్కువగా కోల్పోవడం, ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. డ్రగ్స్ ఓవర్​ డోస్ తీసుకున్నప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్వొచ్చు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఎటాక్ రాకూడదంటే లైఫ్​స్టైల్​లో మార్పులు చేసుకోవాలి. హెల్తీ ఫుడ్​ని తీసుకోవాలి. సాల్ట్, ఫ్యాట్స్, షుగర్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు. రోజుకు అరగంట వ్యాయామం చేస్తే మంచిది. స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్ చేయాలి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్​ను అదుపులో ఉంచుకోవాలి. వయసు 35 దాటిన ప్రతి ఒక్కరూ రెగ్యులర్​గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. 


ఇవన్నీ ఫాలో అవ్వడంతో పాటు సీపీఆర్ చేయడం నేర్చుకోవాలి. ఇది మీకే కాదు.. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వ్యక్తి ప్రాణాన్ని కాపాడడంలో ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి అందరూ సీపీఆర్ నేర్చుకుంటే మంచిది. 




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.