కెనడాలో ఎండలు మామూలుగా లేవు. మన వాడుకలో చెప్పుకోవాలంటే రోళ్లు పగిలేంత వేడిమి అక్కడ పెరిగిపోయింది. దీంతో చాలామంది కెనడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  జూన్ నుంచి వందల మంది వేడిని తట్టుకోలేక మరణించారు. ఇలా వడదెబ్బ కారణంగా మరణించడం తరచూగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఓ మహిళ మాత్రం ‘వాతావరణ మార్పు’ వల్ల తీవ్రఅనారోగ్యం పాలైంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని కైల్ మెరిట్ అనే వైద్యుడు ఈ విషయాన్ని నిర్ధారించాడు. ఒక మహిళ తన వద్దకు శ్వాసకోశ సమస్యతో వచ్చినట్టు చెప్పారాయన. ఆ సమస్య వాతావరణ మార్పు వల్ల ఆమెకు వచ్చినట్టు గుర్తించారు. ఇటీవల ఆమె ఉండే ప్రాంతానికి దగ్గర్లోనే అడవిలో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ వాతావరణంలో వేడి కూడా చాలా పెరిగిపోయింది. దీంతో ఆమెకు ఉబ్బసం సమస్య పెరిగింది. ఊపిరిపీల్చుకోలేక చాలా ఇబ్బంది పడింది. ఈ  ఒక్క ఏడాదిలోనే అడవిలో దాదాపు 1600 సార్లు మంటలు చెలరేగాయి. దీనివల్ల అక్కడి వాతావరణంలో చాలా మార్పులు సంభవించాయి.   


ఇదే తొలికేసు...
ఇంతకు ముందు కూడా చాలా మంది వడదెబ్బకు మరణించారు. అలాగే అతి వేడి వల్ల ఇబ్బంది పడిన వాళ్లు ఉన్నారు. కానీ కేవలం వాతావరణ మార్పు కారణంగా జీవించడానికి ఇబ్బంది పడుతున్న తొలి రోగి ఈ కెనడా మహిళేనని చెబుతున్నారు వైద్యులు. దీనిపై అక్కడి వైద్యులంతా సమావేశమై చర్చలు ప్రారంభించారు. ఈ విధంగా వాతావరణ మార్పు కారణంగా వచ్చే రోగుల సంఖ్య పెరగవచ్చని, వారికి ఎలాంటి చికిత్స చేయాలి? వారినెలా తిరిగి ఆరోగ్యవంతుల్ని చేయాలని కెనడా వైద్యులు చర్చిస్తున్నారు. అందుకోసమే వైద్యులు, నర్సులు కలిసి సమిష్టిగా ఒక సంఘంగా ఏర్పడ్డారు. వాతావరణ మార్పులు, ఆరోగ్యం మధ్య సంబంధాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు, ప్రజలను కాపాడేందుకు ఈ సమాఖ్య పనిచేస్తుంది.  ఈ ఏడాది జూన్ నుంచి కెనడాలో ఎండ రికార్డులను బద్దలుకొడుతోంది. బ్రిటష్ కొలంబియా ప్రావిన్సులో దాదాపు 49.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 
 
ప్రస్తుతం గ్లాస్గోలో జరుగుతున్న COP26 సమ్మిట్లో ప్రజారోగ్యం - వాతావరణ సంక్షోభం మధ్య సంబంధమే హాట్ టాపిక్ గా చర్చలు జరుగుతున్నాయి. యునైటెడ్ కింగడమ్ నిర్వహించిన ‘క్లైమేట్ కాన్ఫరెన్స్’ కోసం ప్రపంచదేశాల నాయకులు కలిసి వచ్చారు. కానీ ఆ కాన్ఫరెన్స్ లో వారు చేసిన ఒప్పందాలు, ప్రకటనలు కేవలం మాటల వరకే పరిమితమయ్యాయని, చేతల్లో ఏమీ లేవని ప్రజలు భావిస్తున్నారు. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: వాయుకాలుష్యం డిప్రెషన్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది జాగ్రత్త... హెచ్చరిస్తున్న కొత్త అధ్యయనం


Also read: గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటున్న ద్రాక్షాయణి


Also read: జుట్టురాలిపోకుండా ఒత్తుగా పెరగాలా... చక్కటి పరిష్కారం విటమిన్ ఇ


Also read: బిగ్‌బాస్‌లో జెస్సీ వ్యాధి ఇదే, వర్టిగో లక్షణాలు... వామ్మో చుక్కలు చూపిస్తాయి


Also read: ఈ శతాబ్ధపు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం... మన దేశంలో ఈ రాష్ట్రాల వారికే కనిపించే అవకాశం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి