Solar Eclipse 2022: హిందూ సాంప్రదయాంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆనాడు కొన్ని పనులు చేయకూడనదని, గ్రహణ సమయంలో కొన్ని పద్ధతులు పాటించాలని చెబుతారు. ఈ ఏడాది దీపావళి మరుసటి రోజై అక్టోబర్ 25న సాయంత్రం గ్రహణం ఏర్పడబోతోంది. మనదేశంలోని చాలా ప్రాంతాల్లో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపించబోతోంది. నాసా చెప్పిన దాని ప్రకారం గ్రహణం మధాహ్నం సూర్యస్తమయానకి ముందు ప్రారంభమవుతుంది. ప్రాంతాలను బట్టి మనదేశంలో సాయంత్రం 4.40 నిమిషాల నుంచి 6.09 నిమిషాల వరకు ఈ గ్రహణం కనిపిస్తుంది.
గ్రహణాన్ని కళ్లతో నేరుగా చూస్తే...
సూర్యుడు - భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రుడు సూర్యుని డిస్క్‌ను పాక్షికంగా మాత్రమే కవర్ చేస్తాడు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్రహణం సమయంలో సరైన రక్షణ లేకుండా కళ్లతో నేరుగా సూర్యుడిని చూడకూడదు. ఇలా చూడడం వల్ల ఒక్కోసారి తీవ్ర సమస్యలు రావచ్చు. శాశ్వత అంధత్వం, లేదా రెటీనా సమస్యలు తలెత్తవచ్చు. దీన్నే సోలార్ రెటినోపతి అంటారు. సూర్య కిరణాలను నేరుగా చూడడం వల్ల మీరు చూసే చిత్రాన్ని కంటి నుంచి మెదడకు ప్రసారం చేసే రెటీనా కణాలు దెబ్బతింటాయి. లేదా పూర్తిగా నాశనం అవుతాయి. రెటీనాలో నొప్పి గ్రాహకాలు లేవు. కాబట్టి గ్రహణం చూసిన వెంటనే రెటీనా కణాలు దెబ్బ తిన్నా కూడా నొప్పి వేయని కారణంగా వెంటనే ఆ విషయం తెలియదు. పది పన్నెండు గంటల తరువాత చూపు మసకబారడం, కనిపించకపోవడం వంటివి జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది.
కళ్లను ఎలా కాపాడుకోవాలి?
గ్రహణం పట్టిన సూర్యుడిని కొన్ని సెకన్ల పాటూ కూడా నేరుగా కళ్లతో చూడకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అంధత్వానికి దారితీస్తుంనది అంటున్నారు. మీరు గ్రహణాన్ని చూడాలనుకు టెలిస్కోప్‌తో లేదా బ్లాక్ పాలిమర్ లేదా అల్యూమినైజ్డ్ మైలార్ వంటి ఫిల్టర్లను ఉపయోగించాని చెబుతున్నారు. సాధారణ సన్ గ్లాసెస్‌తో చాలా మంది గ్రహణాన్ని చూస్తారు. కానీ అలా చేయకూడదు. గ్రహణ సమయంలో పిల్లల్ని ఇంట్లోన ఉంచడం మంచిది. లేకుంటే వారికి తెలియక చూసే అవకాశం ఉంది.
Also read: ఇలాంటి పానీయాలు అధికంగా తాగితే పిల్లలు పుట్టడం కష్టమైపోవచ్చు, జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.