Female Infertility: స్త్రీ జీవితంలో తల్లి కావడం ఎంతో ముఖ్యమైన ఘట్టం. కానీ ఎంతో మంది మహిళలు ఆ ఆనందానికి నోచుకోలేకపోతున్నారు. బిడ్డ పుట్టని స్త్రీకి సమాజంలో ఇంకా చిన్నచూపే ఉంది. వారిని మానసికంగా ఎన్నో రకాలుగా బాధపెడుతుంది సొసైటీ. అందుకే తల్లి కాలేకపోయినా, తల్లి అయ్యేందుకు కష్టపడుతున్న స్త్రీమూర్తులు మానసికంగా కుచించుకుపోతారు. వారిలో చిన్న చిన్న సమస్యలు కూడా సంతానోత్పత్తిని అడ్డుకుంటాయి. ఆ సమస్యలు వారికి తెలియక చేసే కొన్ని తప్పుల  వల్ల కూడా కలుగుతాయి. ఈ తప్పులు మీరు చేశారేమో ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ధూమపానం, మద్యపానం మాత్రమే కాదు ఇంకా ఎన్నో చిన్నగా కనిపించే పనులే ఒక్కోసారి గర్భం దాల్చడాన్ని క్లిష్టంగా మార్చేస్తాయి. 


బరువుతో సమస్యలు
మీరు తక్కువ బరువు ఉన్నా, ఎక్కువ బరువు ఉన్నా కూడా గర్భధారణ కష్టం అవుతుంది. కాబట్టి మీ ఎత్తుకు తగ్గ బరువును కలిగి ఉండడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, చక్కని వ్యాయామం ద్వారా సరైన బరువును పొందవచ్చు. 


నిద్రలేకపోవడం
చాలా మందిలో నిద్రలేమి సమస్య ఉంటుంది. కానీ దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. నిద్రలేమి శరీరంలోని పునరుత్పత్తి వ్యవస్థపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. నిద్రలేమి వల్ల ఒత్తిడి కూడా కలుగుతుంది. ఆ ఒత్తిడి అధికంగా జంక్ ఫుడ్ తినాలన్న కోరికను పెంచుతుంది. దీనివల్ల శరీర బరువు, అండం విడుదల ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల గర్భం దాల్చడం కష్టం అవుతుంది. 


ఒత్తిడి
ఐవీఎఫ్ చికిత్స కోసం వెళ్లినప్పుడు వైద్యులు మిమ్మల్ని ఒత్తిడికి దూరంగా ఉండమని, ధ్యానం చేయమని సూచిస్తారు. ఎందుకంటే ఒత్తిడి మిమ్మల్ని గర్భం ధరించకుండా అడ్డుకుంటుంది. అండోత్సర్గ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. 


బర్త్ కంట్రోల్ పిల్స్
కొందరు అధికంగా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతారు. అప్పుడే పిల్లలు వద్దనే ఉద్దేశం గర్భనిరోధక మాత్రలను రోజూ ఉపయోగిస్తారు. కానీ అవి కొందరి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి వల్ల ఎండోమెట్రియోసిస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటివి రోగాలు వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల గర్భం ధరించలేరు. 


సెక్స్ సమయంలో ఒత్తిడి
సెక్స్ చేసే సమయంలో చాలా మంది ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడి వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. గర్భం దాల్చడానికి తగివనట్టు శరీరం ప్రతిస్పందించకుండా ఆపుతుంది. కాబట్టి సెక్స్ సమయంలో అధిక ఒత్తిడికి గురికావద్దు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు


Also read: యాంటీబయోటిక్ మందులు తీసుకునేటప్పుడు చేయకూడని పనులు ఇవే


Also read: ఆల్కలీన్ ఆహారాలు ఏమిటో తెలుసా? ఇవి తినడం చాలా ముఖ్యం