బరువు తగ్గాలని కోరుకునే వారు గ్రీన్ టీ ని ఎంపిక చేసుకుంటారు. ప్రతిరోజూ రెండుసార్లు గ్రీన్ టీ తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుందని భావిస్తారు. అయితే ఏ ఆహారాన్ని కూడా అతిగా తీసుకోకూడదు. గ్రీన్ టీ సైతం అంతే. దీన్ని అధికంగా తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉంది. అయితే చాలా మందిలో ఉన్న సందేహం గర్భిణీలు గ్రీన్ టీ తాగవచ్చా? లేదా? అని. వీలైనంతవరకు తాగకపోతేనే మంచిది. లేదా రోజులో ఒక్కసారి మాత్రమే తాగాలి. అంతకుమించి గ్రీన్ టీని తీసుకోకూడదు. గ్రీన్ టీని తాగేటప్పుడు గర్భిణీలు, పాలిచ్చే తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టీ వల్ల కొందరిలో కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.


టీ, కాఫీలలో కెఫిన్ అధికంగా ఉంటుంది. గ్రీన్ టీ లో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలను కెఫీన్ ఉన్న పదార్థాలు ఏవి తీసుకోకూడదని చెబుతారు వైద్యులు. దీన్ని బట్టి గ్రీన్ టీ ని కూడా వారు తీసుకోకపోవడమే మంచిది. అయితే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యవసరం. ఆ యాంటీ ఆక్సిడెంట్లు వల్లే గ్రీన్ టీ ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తింపు తెచ్చుకుంది. గర్భం ధరించాక తాగకుండా ఉండలేకపోతే చిన్న గ్లాస్ తో మాత్రమే గ్రీన్ టీను తాగండి. అంతకుమించి తాగకండి. రోజులో ఒక్కసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. అది కూడా మానేస్తే ఎలాంటి సమస్య ఉండదు.


గర్భం ధరించాక మొదటి మూడు నెలలు మాత్రం గ్రీన్ టీకి దూరంగా ఉండటమే ఉత్తమం. ఏడో నెల నుంచి గ్రీన్ టీ తీసుకోవచ్చు. కానీ కొద్ది మొత్తంలోనే కాఫీ మాత్రం పూర్తిగా మానేయడమే మంచిది. గర్భిణులు గ్రీన్ టీ తాగడం వల్ల ప్రసవం అయ్యాక పాల ఉత్పత్తి తగ్గుతుందని చెబుతున్నారు వైద్యులు. అలాగే కాలేయ వ్యాధులు ఉన్నవారు కూడా ఈ పానీయానికి దూరంగా ఉండాలి. గర్భిణులు కొన్ని రకాల మందులు వేసుకుంటూ ఉంటారు. ఆ మందులతో రియాక్షన్ రావచ్చు. కాబట్టి వీలైనంతవరకూ దూరంగా పెట్టడమే ఉత్తమం.


గ్రీన్ టీ తాగే ముందు వైద్యులను సంప్రదించి ఆ తర్వాతే తాగాలి. గ్రీన్ టీ అధికంగా తీసుకుంటే రక్తపోటు తగ్గే ప్రమాదం ఉంది. అలాగే తలనొప్పి కూడా రావచ్చు. ఇది మనసును అశాంతితో నింపేస్తుంది. భయం, ఆందోళన వంటివి కలిగిస్తుంది. నిద్రలేమి కూడా రావచ్చు. కాబట్టి వైద్యులను సంప్రదించాకే గ్రీన్ టీను తాగడం ఉత్తమం.



Also read: గుండె కోసం అప్పుడప్పుడు చెర్రీ టమోటోలను తినండి




Also read: ఇంట్లో ఆస్తమా రోగులు ఉన్నారా? అయితే వీటికి గుడ్ బై చెప్పండి














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.