చెర్రీ టమోటోలు చిన్నవిగా ఉంటాయి. టమోటోలలో ఇవి ఒక రకం. ఇవి ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి. కానీ వీటిని తినేవారి సంఖ్య తక్కువే. కారణం ఇవి కాస్త ఖరీదైనవి. అయితే వారానికి ఒకటి నుంచి రెండుసార్లు అయినా ఈ చెర్రీ టమోటాలను తింటే ఎంతో ఆరోగ్యకరమా అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వీటిని తినడం వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది. చర్మ సమస్యల నుంచి కూడా చెర్రీ టమాటాలని అద్భుతమైన గుణాలు కాపాడతాయి. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్న పోషకాలు మాత్రం నిండుగా ఉంటాయి. సలాడ్లో కూడా వీటిని చేర్చుకొని వచ్చి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడతాయి.
ఈ బుజ్జి టమాటాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే లైకోపీన్, పొటాషియం కూడా నిండుగా ఉంటాయి. లైకోపీన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీరానికి చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిని తినడం వల్ల శరీరానికి అందే క్యాలరీల సంఖ్య కూడా చాలా తక్కువ. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి కూరల్లో వేసుకుంటే మంచి రుచిని కూడా అందిస్తాయి. అల్పాహారంలో కూడా వీటిని భాగం చేసుకోవచ్చు.
పొట్టలోని మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండాలంటే చెర్రీ టమోటాలను తింటూ ఉండాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల నుండి చెర్రీ టమాటోలలోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్షిస్తుంది. అలాగే ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా మగవారిని ఈ చెర్రీ టమాటాలు కాపాడతాయి. ఎముకలను బలంగా మారుస్తాయి. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు చెర్రీ టమోటాలను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది. ఇవి త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ ను ఇస్తాయి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తాయి. దీనివల్ల ఇతర ఆహారాలు ఏవీ మీరు తినరు. తద్వారా బరువు ఆరోగ్యంగా తగ్గొచ్చు. కాబట్టి చెర్రీ టమోటోలను వారానికి ఒకటి రెండుసార్లు అయినా తినేందుకు ప్రయత్నించండి.
చెర్రీ టమోటోలను చాలా మంది సాధారణ పండులా ముక్కుల కోసుకుని తింటారు. వీటి రుచి కాస్త తీపిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ వంటివి రాకుండా ఉంటాయి. రక్తం గడ్డకట్టడం వంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి ఉన్న మహిళలు ఈ చెర్రీ టమోటాలను తినడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది.
Also read: అరటికాయతో ఇలా కోఫ్తా కర్రీ చేస్తే అదిరిపోతుంది
Also read: ఇంట్లో ఆస్తమా రోగులు ఉన్నారా? అయితే వీటికి గుడ్ బై చెప్పండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.